ఎవరికి తెలియని కాజల్ సేవా గుణం.. అంత మంచి పని చేస్తున్నా ఇంతవరకు పబ్లిసిటీ లేదు!
2007 లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా సింపుల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాలోనే తనలోని వైవిధ్యమైన నటనను కనబరిచి అనంతరం తన గ్లామర్ డోస్ కూడా పెంచింది. కాజల్ అంటే అందరికి ఒక హీరోయిన్ అని మాత్రమే తెలుసు. అయితే ఆమెలో ఎవరికి తెలియని ఒక మంచి గుణం కూడా ఉంది. గిరిజన పిల్లల కోసం ఆమె చేస్తున్న సహాయం గురించి ఎవరికి తెలియదు. ఒకసారి ఫిల్మీబీట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి వివరణ ఇచ్చింది కాజల్.

ఆ పిల్లల కోసం..
ఈ రోజుల్లో పది రూపాయల సహాయం చేస్తే.. 100రూపాయల పబ్లిసిటీ చేసుకోవడం కొంతమందికి చాలా అలవాటు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా ఒక గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి పిల్లల కోసం ఏకంగా ఒక స్కూల్ కట్టించింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు వారి పరిస్థితుల గురించి తెలుసుకుంటూ తనకున్న శక్తి మేరకు సహాయం చేస్తోంది.

ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు..
కాజల్ అగర్వాల్ నేడు 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. గత 13ఏళ్లుగా ఆమె ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసింది. వివాదాల జోలికి వెళ్లకుండా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లిగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎప్పుడు నిర్మాతలను ఇబ్బంది పెట్టింది లేదు.

ప్రత్యేకంగా పాఠశాల..
కాజల్ అగర్వాల్ గత కొంత కాలంగా అరకు అరకు వ్యాలీలోని గిరిజన పిల్లల కోసం థింక్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సేవలను అందిస్తోంది. ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్నిసార్లు వారికోసం సమయాన్ని కేటాయిస్తోంది. ఇప్పటికే ఒక పాఠశాలను నిర్మించినన కాజల్ అక్కడి వారి చదువుకోసం ఎంతగానో కృషి చేస్తోంది. కొన్నిసార్లు కాజల్ స్వయంగా అరకు వ్యాలీకి వెళ్లి అక్కడి వారికి ఇంగ్లీష్ క్లాసులు కూడా చెబుతోంది.
Recommended Video

అంత చేసినా.. పబ్లిసిటీ లేదు..
అక్కడ ఉండే ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కాజల్ శానిటేషన్ అలాగే ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఆ గిరిజన పిల్లల కోసం కాజల్ అమెరికాలో కొంతమంది ఎన్నారైల నుంచి సహాయం కూడా కోరింది. నిజానికి కాజల్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కాజల్ కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ప్రమోషన్స్ కూడా చేసుకోలేదు. ఈ ఒక్క విషయంతో కాజల్ మచ్చలేని చందమామ అనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











