"బట్టలిప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించు.. నడుము ముట్టొచ్చా అంటూ టార్చర్"
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, హీరోయిన్ మాధవి లత గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈమె.. గతంలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడి ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అయితే ఆ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తెలుగు సినీ రంగంపై షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా బట్టలు విప్పి మరీ ప్రైవేట్ పార్ట్ చూపించమంటారని.. నడుము ముట్టుకోవచ్చా అంటూ అడుగుతారని వివరించింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2008లో నచ్చావులే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది హీరయినా మాధవీ లత. మొదటి చిత్రంతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత ష్, స్నేహితుడా, ఉసురు, అరవింద్ 2, చూడాలని చెప్పాలని, తొలిపాట వంటి చిత్రాల్లో చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అంబాలా అనే సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. ప్ర్రస్తుతం మూడో కన్ను అనే సినిమా చేస్తోంది. అయితే 2015 తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె పూర్తిగా కృష్ణుడి భక్తురాలిగా మారిపోయింది.

ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి వస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఇప్పటికీ తెలుగు సినీ రంగంలో.. రోజుకు 500 రూపాయలు సంపాదించేందుకు ఓ అమ్మాయి ఎంతగా కష్టపడుతుందో తెలుసా అంటూ వివరించే ప్రయత్నం చేసింది. చిన్న చిన్న నటుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్ల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే అని.. కచ్చితంగా ఎదుర్కుంటున్నారని చెప్పింది. అయితే ఆయా స్థాయిల్లో మార్పులుంటాయే తప్ప... ఇలాంటివి ఫేస్ చేయని అమ్మాయి మాత్రం ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
అలాగే ఈ మధ్య కాలంలోల చాలా మంది అమ్మాయిలు.. విపరీతమైన వల్గారిటీని క్రియేట్ చేస్తున్నారని.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మరీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని మాధవీ లత వెల్లడిచింది. అయితే దాని వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని.. కేవలం రోడ్ల మీద అమ్మాయిల కోసం తిరిగే వాళ్లు, ప్రాంక్ లు చేసే వాళ్లు మాత్రం ఇలాంటి వాళ్లను చూస్తారని పేర్కొంది. ఇలా వీడియోలు చేస్తే కేవలం.. బట్టలిప్పి చూపించు... ప్రైవేట్ పార్ట్ చూపించు.. నడుము ముడతాం.. అది చేస్తాం, ఇది చేస్తామని మాత్రమే వస్తారని వివరించింది.

నిజంగా వాళ్లకు మోడలింగ్, సినిమాలు చేసే ఉద్దేశం ఉంటే ఇలాంటివి చేయకూడదని.. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించరని స్పష్టం చేసింది. నిజంగానే సినిమాల్లోకి రావాలని చేయాలనే ఉద్దేశం ఉంటే క్యూట్ గా కనిపించేలా డ్రెస్ చేసుకోవాలని తెలిపింది. కానీ వల్గారిటీగా మాత్రం ఉండకూడదని మాధవీ లత తెలిపింది.


Click it and Unblock the Notifications











