తెలుగు హీరోయిన్ అందాల సునామీ: అబ్బా గుండెను లాగేస్తుంది భయ్యా
తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు అటు బుల్లితెరపై కానీ, ఇటు వెండితెరపై కానీ పెద్దగా అవకాశాలు దొరికేవి కావు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది భామలు వరుస సినిమాలతో సందడి చేశారు. అందులో నందినీ రాయ్ ఒకరు.
హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మడు ఆరంభంలో కొన్ని ఆఫర్లను అందుకున్నా.. మధ్యలో కాస్త స్లో అయింది. మళ్లీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

మిస్ ఆంధ్రా అవడంతోనే: ఇప్పుడు సినిమాల్లో సందడి చేస్తోన్న నందినీ రాయ్ ముందుగా మోడల్‌గానే ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే తనదైన అందచందాలతో మాయ చేసేసింది. అదే సమయంలో మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచింది. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నందినీ నేషనల్ వైడ్‌గా తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు సాగిపోయింది.

అలా మొదలైన ప్రయాణం: మోడల్‌గా జాతీయ స్థాయిలో పాపులర్ అయిన నందినీ రాయ్‌కు సినిమా అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలు చేసింది. కానీ, అంతగా గుర్తింపును పొందలేదు.

షోతో పేరు.. ఆఫర్లు రాలేదు: సినిమా నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నా.. ఇది అంతగా ప్లస్ కాలేదనే చెప్పాలి.
సినిమాలతో ఫుల్ బిజీగానే: ఆకట్టుకునే అందం, అద్భుతమైన టాలెంట్లు ఉన్నా నందినీ రాయ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కట్లేదు. దీంతో ఈ భామ కొంత కాలంగా వచ్చిన ఆఫర్లతోనే సర్ధుకుపోతోంది. అయితే, ఈ మధ్యన వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది.

అక్కడ యమా యాక్టివ్‌గా: కెరీర్ ఆరంభం నుంచీ అనుకున్న విధంగా సినిమాలు చేయకున్నా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ ట్రీట్‌కు చిరునామా: సరైన అందాలతో సోషల్ మీడియాలో నందినీ రాయ్ ఓ రేంజ్‌లో బోల్డు షో చేస్తూ వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బౌండరీలు దాటేసి మరీ అందాలను ఆరబోస్తూనే ఉంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచడంతో పాటు సెన్సేషన్‌గా మారుతోంది.

నందినీ మళ్లీ షో చేసింది: సోషల్ మీడియాలో హద్దు దాటేసి మరీ రెచ్చిపోతున్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరలోనూ గ్లామర్ షో చేస్తూ రెచ్చగొడుతోంది. ముఖ్యంగా పైటను పక్కకు జరిపి క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











