Heroine: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో పెళ్లీ బాజాలు మొగుతున్నాయి. మొన్నటి వరకు వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఐదేళ్లుగా ప్రేమించుకుని ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీ వేదికగా ఒక్కటయ్యారు. ఇక వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగింది. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందని నెట్టింట న్యూస్ వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకును పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. అసలు ఆ వివరాలు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నెట్టింట ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. జీవా మస్క్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇక గుంటూరు కారం సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో.. ఇక టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. ఇక బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. అక్కడ కూడా ఆశజనకంగా లేదు. ఇక ఈ భామ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. త్వరలో ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతుందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఇరువైపు పెద్దలు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని... రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే పెళ్లి మార్చి చివరల్లో ఉండనుందట.
డిసెంబర్ ఆఖరన నిశ్చితార్థం.. మార్చి చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ దీపావళిని స్పెషల్ గా తనకు కాబోయే అత్తగారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందని పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ బుట్ట బొమ్మను చేసుకోబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి.

అయితే టాలీవుడ్ బుట్టబొమ్మను ఎవరు చేసుకునేది ఎవరు.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై పూజా హెగ్డే ఓపెన్ అయితేనే బాగుంటుందని అంటున్నారు. అయితే ఇందులో ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక పూజా హెగ్డే.. సంపత్ నందీ దర్శకత్వంలో సాయి ధరమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











