లవర్స్‌గా అలాదూసుకుపోయే వాళ్లం.. రేణుదేశాయ్ షాకింగ్ పోస్ట్
Renu desai: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మాజీ సతీమణి, హీరోయిన్ రేణు దేశాయ్ (Renu Desai) సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది. తాజాగా హీరోయిన్ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో లూక్కేయండి.
ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ సినిమాల్లో జోడిగా నటించారు రేణు దేశాయ్. తొలుత బద్రి అనే సినిమాలో నటించింది. ఈ సమయంలో ఏర్పడ్డ పరిచయంతో పవన్ ,రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారట. సహజీవనం ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు అకీరా నందన్, ఆద్య. కొంతకాలం వీరి వివాహబంధం సంతోషంగా సాగింది.

రేణు దేశాయి.. పవన్‌తో తప్ప వేరే హీరోతో నటించలేదు. అయినా ఆమె ఎంతో పాపులర్టీ సంపాదించుకుంది. ఏమైందో తెలియదు గానీ, వారి వైవాహిక బంధం వీడిపోయింది. విడాకులు తీసుకునే వేరుగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత ఆద్య, అకీరా నందన్ బాధ్యత తీసుకుంది. ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరావు' మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది రేణు దేశాయ్ .
హీరోయిన్ రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు. ఆమె నిత్యం పేదలు,మూగ జీవుల రక్షణ, వైద్యం కోసం విరాళాలు అందిస్తూనే ఉంటుంది. అలాగే.. మూగ జీవుల సంరక్షణ కోసం విరాళాలను కూడా సేకరిస్తుంటుంది. మూగ జీవుల సంరక్షణ కోసం పని చేసే స్వచ్చంద సంస్థలకు కూడా తన వంతు సహయం అందిస్తోంది. నిత్యం నోరు లేని జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటుంటారు రేణు దేశాయి. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications











