బీచ్‌లో బాగా తెగించిన హీరోయిన్: సినిమాల్లో పద్దతిగా.. బయట మాత్రం ఇలా!

గతంలో కంటే ఇప్పుడు సినీ రంగంలో హీరోయిన్ల విషయం చాలా పోటీ ఉంది. దీంతో టాలెంట్లతో పాటు అందం ఉన్న అమ్మాయిలు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు సాగిస్తున్నారు. అలాంటి అమ్మాయిల్లో రుహానీ శర్మ ఒకరు. ఆరంభంలోనే తనదైన గ్లామర్, యాక్టింగ్‌తో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇలా ఇప్పుడు కూడా పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

అలా సెన్సేషన్ అయిందిగా: హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అనంతరం పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. వీటికి అదిరిపోయే స్పందన రావడంతో అప్పట్లోనే రుహానీ సెన్సేషన్ అయింది. ఈ కారణంగా ఈ అమ్మడు ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

ఫస్ట్ మూవీకే నేషనల్ అవార్డ్: సినిమాల్లోకి రాకముందే ఫుల్ పాపులర్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో కెరీర్‌ను మొదలెట్టింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని అందరి మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమె కూడా హైలైట్ అయింది.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

చాలా ఆఫర్లు.. సక్సెస్ రాలే: ఆరంభంలోనే నేషనల్ అవార్డు మూవీలో భాగం అయిన రుహానీ శర్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని అందుకోలేదు. దీంతో రుహానీ కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగట్లేదు.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

అలా వచ్చి.. వెంకటేష్‌తోనే: రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌‌లో చేసింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ నటించింది. ఇటీవలే తెలుగులో ఈ అమ్మడు 'HER Chapter 1' అనే సినిమాతో వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు రుహానీ హిందీలో 'ఆగ్రా' మూవీ చేస్తోంది. దీనితో పాటు వెంకటేష్ - శైలేష్ కొలను 'సైంధవ్' మూవీలోనూ చేస్తోంది.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

అందులో మాత్రం బిజీగానే: మోడలింగ్ రంగంలో సందడి చేస్తున్నప్పటి నుంచే రుహానీ శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇక, హీరోయిన్‌గా వచ్చిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

గ్లామర్ షోతో కవ్విస్తోందిగా: సామాజిక మాధ్యమాల్లో రుహానీ శర్మ ఏ రీతిలో అందాలను ఆరబోస్తుందో తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ హెడ్‌లైన్‌లోనే ఉంటోంది.

Tollywood Heroine Ruhani Sharma Latest Fabulous Photos Viral

బీచ్‌లో అందాల ప్రదర్శన: సినిమాల్లో డీసెంట్‌గా కనిపించినా.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో స్విమ్‌సూట్ ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం బయటపడుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి.. యమ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X