Samantha: 'శాకుంతలం' విడుదల పోస్టర్ పై సమంత రియాక్షన్.. ఏమందంటే?

సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా యూత్​లో మంచి క్రేజ్​ సంపాదించుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా జోరుగా దూసుకుపోతోంది సామ్. ఇటీవలే ఆమె నటించిన యశోద చిత్రం టీజర్ విడుదలై ఆకట్టుకుంది. దీని తర్వాత పాన్ ఇండియాగా వస్తున్న శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఈ ప్రకటన పోస్టర్ పై తాజాగా స్పందించింది సమంత.

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా దూసుకుపోతోంది సమంత. ఆమె నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ చాలా రోజుల కిందటే పూర్తియింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇటీవల ఈ మూవీని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమంత అభిమానులు సంబరపడిపోయారు.

Tollywood Heroine Samantha Reaction On Shakuntalam Release Poster

ఇదిలా ఉంటే తాజాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రియాక్ట్ అయింది. వైట్ కలర్ లోని లవ్ సింబల్ పెడుతూ శాకుంతలం నవంబర్ 4న విడుదల కానుంది అని ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు ఇందులో నటిస్తున్న దేవ్ మోహన్ ను ట్యాగ్ చేసింది. ఇక శాకుంతలం నవంబర్ 4న విడుదలవుతున్న సందర్భంగా పలువురు స్పందిస్తున్నారు. వాటికి రిప్లైలు ఇస్తుంది సమంత. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ చేస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటించాడు. ఇటీవలే అతనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ శాకుంతలం చిత్రంలో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో డీఆర్పీ, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందొంది. నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరించగా, మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. శేఖర్ వి జోసేఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు.

ఇక ఇటీవల దిల్ రాజు తన సోషల్ మీడియా అకౌంట్ లో శాకుంతం సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో విడుదల తేదిని ప్రకటించారు. అలాగే ఈ పోస్టర్ లో సమంత, దేవ్ మోహన్ చాలా రొమాంటిక్ గా కనిపించారు. అయితే కొన్నాళ్ల క్రితం ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కానీ విడుదల కాలేదు. ఇక సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రం ఉన్నందున శాకుంతలం సినిమాను నవంబర్ తొలివారంలో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శాకుంతలం సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉన్నాయట. అందుకోసం చాలా సమయం, శ్రమ వెచ్చించాల్సి వచ్చిందట. అందుకే శాకుంతలం విడుదల ఆలస్యం అయినట్లు డైరెక్టర్ గుణ శేఖర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X