శ్రద్దా దాస్ ఓవర్ డోస్ ప్రదర్శన: అస్సలు దాగని అందాలతో రచ్చ

ఒకప్పుడు సినిమా ఆఫర్లు దక్కని హీరోయిన్లు అందరూ కనుమరుగు అయిపోయేవాళ్లు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంత కాలం అయినా వార్తల్లోనే నిలుస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ ఒకరు. అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను సుదీర్ఘ కాలంగా అలరిస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే శ్రద్దా దాస్ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. వరుస ఆఫర్లు:మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో గుర్తింపును తెచ్చుకున్న శ్రద్దా దాస్‌కు సినిమా ఆఫర్లు భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ అల్లరి నరేష్ హీరోగా చేసిన 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఫలితంగా శ్రద్దా పేరు మారుమ్రోగింది.

 Tollywood Heroine Shraddha Das Fantastic Photos Viral

చాలా చేసినా స్టార్ కాలేదు:తెలుగులో చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన శ్రద్దా దాస్.. ఆరంభంలోనే 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలు చేసింది. కానీ, వీటిలో ఆమెకు హిట్లు పెద్దగా రాలేదు. దీంతో స్టార్‌డమ్ కూడా దక్కలేదు.

ఇప్పుడు అలాంటి పాత్రలే:గతంలో మాదిరిగా ఇప్పుడు హీరోయిన్‌గా ఆఫర్లను అందుకోలేకపోతోన్న శ్రద్దా దాస్.. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే బోల్డు క్యారెక్టర్‌ను చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాలనే చేస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

 Tollywood Heroine Shraddha Das Fantastic Photos Viral

ఢీతో మెప్పించి.. ట్రిప్‌లతో:అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం అంతగా రాణించలేకపోతోన్న శ్రద్దా దాస్.. షోలు, ఈవెంట్లలో సైతం భాగం అవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈటీవీలో 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేసింది. ఇప్పుడు ఖాళీ సమయంలో మాత్రం ఈ అమ్మడు ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా పర్సనల్‌ను తెగ ఎంజాయ్ చేసేస్తోంది.

 Tollywood Heroine Shraddha Das Fantastic Photos Viral

అందులో ఎప్పుడూ బిజీగా:అందం, అభినయంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా మరింత క్రేజ్ అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా గడుపుతోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ముందుకెళ్తోంది.

 Tollywood Heroine Shraddha Das Fantastic Photos Viral

అందాలను దాచుకోదుగా:సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌తో మెప్పించిన శ్రద్దా దాస్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హల్చల్ చేసేస్తోంది. ఇందులో విపరీతంగా అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటి మరీ బాడీ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ హాట్ షోతో ఇంటర్నెట్‌‌లో సెన్సేషన్ అయిపోతుంది.

 Tollywood Heroine Shraddha Das Fantastic Photos Viral

శ్రద్దా బోల్డు పిక్స్ వైరల్‌‌గా:గతంలో కంటే ఈ మధ్య కాలంలో డోసు పెంచేసిన శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై చీరను ధరించి దర్శనమిచ్చింది. ఇందులో ఆమె అందాలు తన్నుకొస్తూ హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. తద్వారా శ్రద్దా ఫొటోలు అన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X