8 ఏళ్లుగా ప్రేమాయణం.. ఎట్టకేలకు పెళ్లి.. ముహూర్తం ఎప్పుడో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!
గతేడాది చాలా మంది సినీ ప్రముఖులు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఎక్కువ ఏజ్ కాకముందే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే కొత్త ఏడాది కూడా చాలా మంది హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. సమయం దొరికితే మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఓ ఇంటి వాళ్లు అయిపోవాలని అనుకుంటున్నారు. అయితే తాజాగా మరో ముద్దుగుమ్మ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా 8 ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఓ కుర్ర హీరోయిన్.. ప్రియుడినే పెళ్లి చేసుకోబోతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
హిందీ ధారావాహికల్లో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న సోనారిక భడోరియా గురించి అందరికీ తెలిసిందే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ ముందుగా బాలీవుడ్ లో కెరియర్ ప్రాంరంభించింది. అద్భుతమైన సీరియల్స్ లో అమ్మవారి రూపంలో కనిపిస్తూ అందరినీ అలరించింది. పార్వతీ దేవిగా, శక్తిమాతగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే హిందీలో ఇలాంటి పాత్రల్లో కనిపించిన ఈ హాట్ బ్యూటీ.. తెలుగులో ఈ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించింది.

2015లో జాదుగాడు అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత ఏడాదే మరో రెండు సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. ముఖ్యంగా స్పీడున్నోడు, ఈడోరకం, ఆడోరకం వంటి చిత్రాల్లోనూ నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత హిందీతో పాటు తమిళ సినిమాల్లో నటించిన ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకు పోతున్న ఈమె పర్సనల్ లైఫ్ లోనూ మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది. ముఖ్యంగా తన ప్రియుడినే పెళ్లాడబోతుంది.

గత ఎనిమిది సంవత్సరాలుగా.. సోనారిక భడోరియా.. వ్యాపారవేత్త వికార్ పరశార్ తో ప్రేమలో ఉంది. అయితే వీరిద్దరూ ఈ విషయాన్ని గతంలోనే చెప్పారు. అంతేకాదండోయ్ 2022 డిసెంబర్ నెలలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్ మెంట్ చేసుకుని ఏడాది గడుస్తుండగా.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపారు. వికాస్ రాజస్థాన్ కు చెందిన వాడు కావడంతో అక్కడే వీరి పెళ్లి జరగనుందట. ఫిబ్రవరి 18వ తేదీన వీరి పెళ్లి గ్రాండ్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











