‘న్యూడ్’ బ్రాండ్ అంబాసీడర్‌గా శ్రీలీల.. కోట్ల రూపాయలు పెట్టిన టాలీవుడ్ హీరో
తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే తమదైన రీతిలో ప్రభావాన్ని చూపించి స్టార్లుగా మారుతున్నారు. అలాంటి వారిలో శ్రీలీల ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందంతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. యాక్టింగ్, డ్యాన్స్‌తోనూ అలరిస్తోంది. తద్వారా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసీడర్ అయింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
డాక్టర్ అవ్వాలని యాక్టర్
శ్రీలీలకు చిన్న వయసులోనే కళారంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉండేది. అందుకే టీనేజ్‌లో ఉన్నప్పుడు భరత నాట్యం నేర్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత డాక్టర్ అవ్వాలనుకుని మెడిసిన్ చదివింది. వైద్యురాలుగా మారి సమాజానికి సేవ చేయాలని భావించిన శ్రీలీల ఊహించని విధంగా 2019లో వచ్చిన 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.

పెళ్లి సందడి.. 100 కోట్లు
కన్నడ చిత్రంతో ఎంటరైన శ్రీలీల 2021లో వచ్చిన 'పెళ్లి సందD' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత ఈ చిన్నది రవితేజతో 'ధమాకా' చేసి వంద కోట్లు కొట్టింది. అనంతరం 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' వంటి చిత్రాలు చేసింది. కానీ, విజయాన్ని మాత్రం అందుకోలేదు.
బాలయ్యతో హిట్టు కొట్టి
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న శ్రీలీల.. గత ఏడాది నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' మూవీ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీని తర్వాత మహేశ్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' అంతగా ఆడలేదు. ఇక, ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రీలీల.. పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాలో నటిస్తోంది.

ఆ ఇద్దరితోనే మరోసారి
కెరీర్ ఆరంభం నుంచీ ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్రీలీల.. ఇప్పుడు నితిన్ సరసన 'రాబిన్‌హుడ్' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు రవితేజతో మరోసారి జతకడుతోంది. ఈ చిత్రాలు మాత్రమే కాదు.. శ్రీలీల ఏకంగా ప్రభాస్ సినిమాలోనూ చాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు టాలీవుడ్‌లో సంచలనం అవుతోంది.
న్యూడ్ బ్రాండ్ కూడా
ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న శ్రీలీలకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అయితే ఇది సినిమా ఛాన్స్ కాదు.. బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ అయిన 'న్యూడ్' (Neude) సంస్థ నుంచి వచ్చింది. దీనికి శ్రీలీల బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ బ్రాండ్‌లో దగ్గుబాటి రానాకు కూడా భాగస్వామ్యం ఉంది.


Click it and Unblock the Notifications











