Pushpa 2: ఐటెం సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్.. అల్లు అర్జున్ తో మాస్ స్పెప్పులు పక్కా..

Pushpa 2 Item Song: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న 'పుష్ప ది రూల్ '(Pushpa The Rule). ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సీని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవ్వగా ఒక్క ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉందని మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆ ఐటెం సాంగ్ షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో 'పుష్ప 2' సినిమాలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఐటెం సాంగ్ లో డ్యాన్సింగ్ క్వీన్ స్టెప్పులేసింది. ఈ ఇంతకీ పుష్పరాజ్ తో చిందులేసిన డ్యాన్సింగ్ క్వీన్ ఎవరంటే?

హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ అంటే ఫ్యాన్స్ కు పునకాలతో ఊగిపోతారు. అలాంటి వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ వస్తున్న ఐటెం సాంగ్ అంటే.. మాస్ ఆడియన్స్ కు జాతరే. ఈ సాంగ్ కోసం తెగ తహతహలాడుతారు. అంచనాలు తార స్థాయికి చేరుకుంటాయి. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ తో హాట్ హీరోయిన్స్ మాస్ స్టెప్పులేస్తుంటే.. ఇక రచ్చ రంబోలనే.

Tollywood heroine Sreeleela doing special song in allu arjun pushpa 2 The Rule

డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్స్‌కు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన స్పెషల్ సాంగ్స్ చూస్తే.. ఆర్య సినిమాలో 'అ అంటే అమలాపురం', ఆర్య 2 మూవీలో 'రింగ రింగా', నాగ చైతన్య 100% లవ్ సినిమాలో 'డియ్యాలో డియ్యాల', రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీలో 'జిగేలు రాణి' వంటి స్పెషల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆయా సినిమాలు హిట్ కావడంతో కీ రోల్ ప్లే చేశాయి.

ఇలా 'పుష్ప1'లోని తెరకెక్కిన 'ఊ అంటావా మావ' సాంగ్ లో సమంతతో స్టెప్పులు వేయించడమంటే.. అది డైరెక్టర్ సుకుమార్ తో సాధ్యం. ఈ ఐటెం సాంగ్ లో సమంత హాట్ లుక్‌తో మాస్ స్టెప్పులేసి.. అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఐటెం సాంగ్ లో సమంత చేసిందనే కారణంతో నార్త్ లో ప్రమోషన్స్ చేయకపోయినా హిందీ వర్షన్ లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు మూడేండ్ల కిత్రం వచ్చిన సాంగ్ అయినా.. ఈ సాంగ్ కు ఉన్నా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రెటీలు కూడా సెప్పులేసిన విషయం తెలిసిందే.

Tollywood heroine Sreeleela doing special song in allu arjun pushpa 2 The Rule

ఇక 'పుష్ప ది రూల్‌'(Pushpa 2)లో కూడా అదేస్థాయిలో ఓ స్పెషల్ సాంగ్‌ ఉండబోతున్నదని మూవీ మేకర్స్ ప్రకటించి హైప్స్ పెంచారు. అయితే.. సాంగ్ లో ఏ హాట్ బ్యూటీ స్టెప్పులేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌, 'యానిమల్' ఫేమ్ త్రుప్తి డిమ్రిల్లో ఎవరో ఒకరూ నటించబోతున్నారని టాక్ వచ్చింది. అయితే.. ఈ స్పెషల్ సాంగ్ లో సెప్పులేయడానికి దాదాపు 10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

గత వారం రోజులుగా ఈ సాంగ్ సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగవైరలవుతున్నాయి. బాలీవుడ్ భామలను సైడ్ చేసి.. టాలీవుడ్ బ్యూటీ , డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను సెలక్ట్ చేశారు. తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా శ్రీలీల పోస్టర్ ని రిలీజ్ చేసారు. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ లో ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒక్కరు. బన్నీ, శ్రీలీల కలిసి స్టెప్పులు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక పుష్ప-2 విషయానికి వస్తే.. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో.. మొత్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. ఇందులో ఇండియాలో 6500 స్క్రీన్స్‌, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లతో చాలా గ్రాండ్‌ విడుదల కాబోతున్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు. అలాగే.. పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దుమ్మురేపినట్టు తెలుస్తోంది. రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 దేశంలోనే అత్యంత భారీ బిజినెస్ మూవీగా నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: allu arjun sreeleela sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X