షాకిచ్చిన శ్రీలీల.. అలాంటి వాటిల్లో అస్సలే నటించదట.. ముద్దుగుమ్మ ముచ్చటకు ఫ్యాన్స్ ఖుషీ!
పెళ్లి సందడి సినిమాతో మూడేళ్ల క్రితం తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమాలోనే తన అందచందాలు చూపించి.. అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయిందీ క్యూట్ బ్యూటీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రంతోనే అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇక ఆ తర్వాత నుంచి తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది.
ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటిస్తోంది. చిన్న వయసులో కూడా పెద్ద పెద్ద హీరోల పక్కన అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అలరిస్తుంది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ వంటి టాప్ హీరోలతో కలిసి పని చేస్తోంది. ఈమె సినిమాలో ఉందంటే కేవలం నటన మాత్రమే కాకుండా అందానికి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈమె చేసే చాలా చిత్రాల్లో అదిరోపోయే మాస్ స్టెప్పులు వేస్తూ అలరిస్తోంది. తాజాగా ఈమె కుర్చి మడతపెట్టి పాటలో ఎలాంటి స్టెప్పులు వేసిందో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అనేక చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈమె.. కొన్ని యాడ్స్ లో నటించేందుకు మాత్రం అస్సేల ఒప్పుకోవట్లేదట. గట్టిగా, నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట. తాను అలాంటి యాడ్స్ లో అస్సలే నటించనంటూ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఫాలో అవుతుందట. కోట్లు ఇస్తామని వస్తున్నా.. అవన్నీ తనకు అవసరం లేదని చెప్పుకొస్తుందట. మరి ఆ యాడ్స్ ఏంటి, ఎలాంటి వాటిల్లో ఆమె కనిపించేందుకు అస్సలే ఒప్పుకోవట్లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిమిషం పాటు కనిపించే చిన్న చిన్న యాడ్స్ లో నటిస్తూనే కోట్లు సంపాధించుకుంటున్నారు చాలా మంది నటులు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్, వైన్స్ కు సంబంధించిన యాడ్స్ చేయిస్తుంటారు. డబ్బుల కోసం ఎలాంటి వాటిల్లో అయినా కనిపిస్తుంటారు. కానీ శ్రీలీ మాత్రం అలాంటి వాటికి అస్సలే ఒప్పుకోవట్లేదు. ఎంత డబ్బులు ఇస్తామని వచ్చినా ఆల్కాహాల్ సంబంధిత యాడ్స్ తో పాటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన యాడ్స్ లలో అస్సలే నటించనని అంటోందట. అల్లు అర్జున్ కూడా ఇలాంటి యాడ్స్ లో నటించేందుకు అస్సలే ఒప్పుకోరు. చాలా సార్లు ఆయనకు సంబంధించిన వార్తలు వెలుగులోకి రాగా.. తాజాగా శ్రీలీల కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శ్రీలీల ఫ్యాన్స్ అంతా తెగ ఖుషీ అవుతున్నారు. విలువలు పాటించడంలో మా క్యూట్ బ్యూటీ ఎప్పుడూ ముందే ఉంటుందని వివరిస్తున్నారు. తెగు సంబురపిడపోతూనే శ్రీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగానే శ్రీలీల పాటిస్తున్న విలువలకు అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


Click it and Unblock the Notifications











