35 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్.. ఎవరు పుట్టారో తెలుసా?

ఈ మధ్య కాలంలో అనేక మంది స్టార్ హీరోహీరోయిన్లు ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు. అలా అయినవాళ్లు పిల్లలకు జన్మననిస్తూ తల్లిదండ్రులుగా మారుతున్నారు. ముఖ్యంగా వరుసగా గుడ్ న్యూస్ లు చెప్పడం మాత్రం ఎవరూ ఆపట్లేదు. అయితే మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. అంతేకాదండోయ్ అతిడికి ఓ పేరును కూడా పెట్టేసింది. అయితే ఆ బాబు పేరు ఎంటి, అసలు బిడ్డకు జన్మనిచ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అయిన యామీ గౌతమ్ కు ప్రస్తుం 35 ఏళ్ల వయసు. పంజాబ్ లోని చండీఘడ్ లో 1988 నవంబరు 28న జన్మించిన ఈమె.. మొదట పలు హిందీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. 2010 లో ఉల్లాస ఉత్సాహలో అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత అంటే 2012 లో హిందీ చిత్రం విక్కీ డోనర్ లో నటించి హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. వీర్య దానంపై నిర్మింపబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా తన అందం, అభినయంతో అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Tollywood Heroine Yami Gautam Gave Birth To Child Check Details

ముఖ్యంగా నువ్విలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన యామీ గౌతమ్.. గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే ఆర్టికల్ 370లో నటించి సూపర్ హిట్ కొట్టింది. అయితే అదే సమయంలో తాను గర్భం దాల్చినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా 2019లో ఉరి సినిమా చేస్తున్న సమయంలో ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో ప్రేమలో పడింది. రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట 2021లో ఇరుకుటుంబాలను ఒప్పించి మరీ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి చాలా హాయిగా ఉంటున్న ఈ జంట తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

సోషల్ మీడియా వేదికగా అటు ఆదిత్యధర్ తో పాటు ఇటు యామీ గౌతమ్ తాము తల్లిదండ్రులు అయినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. సూర్య ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చిన యామీ.. ఆసుపత్రికి సిబ్బందికి, వైద్యులకు థాంక్స్ చెప్పింది. వారి సహాయసహకారాల వల్ల తాను ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా బిడ్డకు జన్మను ఇచ్చినట్లు వివరించింది. అలాగే తమ కొడుకు వేదావిద్ అనే పేరు పెట్టిట్లు తెలిపింది.

యామీ గౌతమ్ తో పాటు ఆమె భర్త ఆదిత్య ధర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. బాబుతో పాటు మీరు కూడా నిండునూరేళ్ల చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. యామీ ఫ్యాన్స్ అయితే... ఎంత మంచి న్యూస్ చెప్పావు యామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ కూడా ఓసారి ఈ క్రేజీ కపుల్ చేసిన పోస్ట్ ను చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X