Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్‌లో శ్రీలీల.. కోట్ విప్పేస్తూ మరీ కిల్లింగ్ ఫోజులు.. మీరూ చూశారా?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ లుక్ లో కనిపించి.. కుర్రకారును సర్ ప్రైజ్ చేసింది. కోట్ విప్పేస్తూ మరీ.. కిల్లింగ్ ఫోజులు పెడుతూ కవ్విస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి సందడి సినిమాతో రెండేళ్ల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రంతోనే అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. ముఖ్యంగా కుర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ బ్యూటీ అనేక సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది.

Tollywood Most Wanted Heroine Sreeleela Summer Special Look Photos Goes Viral

టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోల అందరి సరసన నటించేందుకు సిద్ధం అయిన ఈ బ్యూటీ ఇప్పటికే మహేష్ బాబు, బాలకృష్ణల సరసన నటించి మెప్పించింది. పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ వంటి టాప్ లీగ్ హీరోలతో కలిసి పని చేయడానికి సైన్ కూడా చేసేసింది. అద్భుతమైన అందంతో పాటు అంతకు మించిన డ్యాన్స్ చేయగల ఈ బ్యూటీ.. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. అలాగ్ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో వైట్ కలర్ సూట్ వేసుకుని సోకులు ఆరబోసింది. సమ్మర్ లోనూ నిండుగా బట్టలు వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చిన ఈ మె ఆతర్వాత కాసేపటికే.. కోట్ విప్పేసి మరీ కిల్లింగ్ ఫోజులు పెట్టింది. కూలింగ్ గ్లాసెస్ స్టైల్ చేసి తన సోకులు ఆరబోసింది. యమా క్రేజీగా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

నిన్ను చూసి తట్టుకోవడం కష్టమే పాపా అంటూ కొందరు.. ఇంతందం ఏంటమ్మా.. మమ్మల్ని చంపేస్తావా ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలైన సమ్మర్ ట్రీట్ ఇదంటూ పలువురు నెటిజెన్లు ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఇంత అద్భుతంగా కనిపిస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల ఫొటోలను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏమాత్రం ఆలోచించకుండా.. వెంటనే చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X