పవన్ కల్యాణ్‌తో స్విమ్మింగ్ పూల్‌లో అలా ముద్దు పెట్టించుకోవాలనుంది.. కుర్రహీరోయిన్ షాక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. చాలా మందికి ఇప్పటికీ హాట్ ఫేవరెట్ యాక్టర్ గా ఉండే ఈయనతో ఫొటో దిగాలని, హగ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. మరికొంత మంది లేడీ ఫ్యాన్స్ అయితే కిస్ కూడా కావాలని కోరుకుంటారు. కానీ ఓ హీరోయిన్ కూడా ఇలా కోరుకోవడం.. ముఖ్యంగా ఆయనతో కలిసి రొమాన్స్ చేయాలనుకోవడం.. అందులోనూ స్విమ్మింగ్ ఫూల్ లోపల కిస్ చేసుకునే సీన్ చేయాలని ఉందంటూ చెప్పి షాక్ ఇచ్చింది. కుర్ర హీరోయిన్ తాజాగా తన కోరిక గురించి చెప్పగా.. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

బజ్జీల పాపగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరోయిన్ కుషిత కల్లపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఓసారి పబ్ కు వెళ్లి పోలీసులకు దొరకగా.. పబ్ కు వెళ్లి బజ్జీలు తినేసి వచ్చామంటూ చెప్పింది. అలా ఫుల్ వైరల్ అయిన ఈమె తాజాగా బాబు అనే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో అర్జున్ కల్యాణ్ తో కలిసి దావత్ అనే షోలో పాల్గొంది.

Tollywood New Heroine Kushitha Kallapu Dream is Romance With Pawan Kalyan check Detials

అక్కడే తన కోరిక గురించి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తాను రొమాంటిక్ సీన్స్ అస్సలే చేయను అని, ముద్దు సీన్లలో కూడా నటించనని చెప్పింది. ఏదైనా ముందుగా తన భర్తకే అంటూ చెప్పింది. కానీ తాజాగా పాల్గొన్న షోలో మాత్రం ఆ మాట మార్చేసింది. హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రొమాంటిక్ సీన్ లో నటించాలని ఉందంటూ వివరించింది. ముఖ్యంగా బాబు సినిమాలో స్విమ్మింగ్ పూల్ లో కిస్ సీన్ చేయాల్సి ఉందని.. కానీ తాను భయపడి, వద్దని చెప్పడంతో డైరెక్టర్ లైట్ తీసుకున్నట్లు వివరించింది.

అర్జున్ కల్యాణ్ తో కిస్ సీన్ అనే భయపడ్డావు కదా.. అతడిని ఊహించుకునే నో చెప్పావు కదా అంటే.. అవునంటూ సమాధానం చెప్పింది. అలాగే పవన్ కల్యాణ్ అయితే అలాంటి సీన్లు చేస్తానని.. స్విమ్మింగ్ పూల్ లోపల ముద్దు సీన్ చేస్తానంటూ చెప్పింది. ఆమె ఇలా చెప్పగానే అంతా షాక్ అయ్యారు. మామూలుగా లేవుగా నీ కోరికలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tollywood New Heroine Kushitha Kallapu Dream is Romance With Pawan Kalyan check Detials

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తాను బోల్డ్ సీన్లు చేయనని.. చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి.. మళ్లీ పవన్ కల్యాణ్ తో కిస్ సీన్ చేయాలని ఉందనంగా నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజంగానే అలాంటి సీన్లలో నటించదా.. లేక తన ఫేవరెట్ హీరో పవన్ కల్యాణ్ కాబట్టి, ఎలాగూ తన కోరిక నెరవేరదని అలాంటి కామెంట్లు చేసిందా అనేది మాత్రం తెలియదు. చూడాలి మరి ముందుముందు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా అవకాశాలు దక్కించుకుని.. ఎలాంటి పాత్రలు చేస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X