‘ఆ ప్రొడ్యూసర్ నా జీవితాన్ని నాశనం చేశాడు’.. బిగ్ బాస్ 9 ఆశా షైనీ ఆవేదన
టాలీవుడ్ సీనియర్ నటి, ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆశా షైనీ టాప్ నటిగా వెలుగొందింది. కానీ తర్వాత బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆపై హిందీ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. కానీ ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో లవ్ లో ఉండి చాలా నష్టపోయిందని తెలిపింది. ఇక గతంలో తనపై కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో ఆమె కెరీర్ కూడా నాశనమైంది. సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు దూరంగానూ ఉంది. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రం 12 ఏళ్లుగా దూరమై పోయింది.
ఇక ఆశా షైనీ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా తెలుగు ప్రేక్షకులను తిరిగి పలకరించింది. దశాబ్ద కాలం తర్వాత ఫ్లోరా షైనీ సౌత్ ప్రేక్షకులను దక్షిణాదిన అడుగు పెట్టింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీగా ఇవ్వడాని కంటే ముందు ఆశా షైనీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొనింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పోలీస్ కేసులు, లవ్ బ్రేకప్, కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేసింది.

ఇంటర్వ్యూలో ఆశా షైనీ మాట్లాడుతూ.. నేను ముంబైకి వెళ్లిన తర్వాత చాలా స్ట్రగుల్ చేశాను. ఒక సినిమాను రిజెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఒక నిర్మాతతో లవ్ ఎఫైర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి చాలా వయలెన్స్ ను ఫేస్ చేశాను. స్త్రీ వ్యతిరేకతను చూశాను. ఆ తర్వాతనే నాకు దవడ ఎముకలు కూడా విరిగిపోయాయి. వాళ్లు నన్ను అంతలా కొట్టారు. దారుణంగా నాతో ప్రవర్తించారు. నన్ను వాడుకున్నారు. శారీరకంగా, మానసికంగా క్షోభ పెట్టారు. ఆ రిలేషన్ మొత్తం నాకు ట్రాప్ లానే అనిపించింది. నన్ను పూర్తిగా వినియోగించుకున్నాడు.
అసలు నన్ను అంతగా కొట్టడానికి, నాతో దారుణంగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏంటనేది వాళ్లు అసలు చెప్పలేదు. చిన్నప్పుడు తప్పులు చేస్తుంటే సాధారణంగా అమ్మ తలపై ఒక్కటి ఇస్తూ ఉంటుంది. కానీ అందుకు కారణం ఉంటుంది. వీళ్లు ఇలా ఎందుకు చేశారనేది కారణం లేదు. పైగా దారుణంగా కొట్టారు. నా బ్యూటీఫుల్ కెరీర్ కూడా నాశనమైంది. టాలీవుడ్ లో నేను అప్పుడు చాలా టాప్ హీరోయిన్ గా కొనసాగాను. కానీ ఆ ప్రొడ్యూసర్ వల్లే నా జీవితం నాశనమైంది. లవ్ బ్రేకప్ కు ముందు చాలా హింసించారు.
దాంతర్వాత నామీద కేసు కూడా ఫైల్ చేశారు. అలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రావాల్సి వచ్చింది. అలా కేసులతో చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఒత్తిడికి గురయ్యాను. అయితే అదే సమయంలో నాకు హైదరాబాద్ నుంచి ఒక యూఎస్ ఈవెంట్ ఆఫర్ వచ్చింది. అప్పుడు వాళ్లు ఒక ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ ను పంపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐడెంటింటీ, పాస్ పోర్టు, ఆమె పేరు, బ్యాంక్ స్టేట్ మెంట్, ఇలా అన్నీ ఫేకే. దాని వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అలా మళ్లీ సమస్యలో ఇరుక్కున్నాను. ఇలా అన్నీ దాటుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చింది.
అయితే బిగ్‌బాస్ ఇంటిలో తన జీవితం గురించి సభ్యులతో పంచుకొన్నారు. తన రిలేషన్‌షిప్ తన లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపించిందనే విషయాన్ని వివరించింది. అయితే తన రిలేషన్‌షిప్ గురించి సంజన గల్రానీ చర్చించడంపై ఆమె అభ్యంతరం తెలిపింది. తన రిలేషన్‌షిప్ గురించి నా అనుమతి లేకుండా ఎలా మాట్లాడుతావని ఆశా సైనీ ప్రశ్నించింది. అయితే అందుకు సంజనా సారీ చెప్పడంతో ఇంటిలో వాగ్వాదానికి తెర పడింది.


Click it and Unblock the Notifications











