"శరత్ బాబుతో బిడ్డను కనాలనుకున్నాను.. వాళ్ల వల్లే మా పెళ్లి కాలేదు"

టాలీవుడ్ సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తూ ఎంటర్ టైన్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. గతంలో సీనియర్ హీరో శరత్ బాబును పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు, ఓ బిడ్డను కూడా కనాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపింది. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

హీరోయిన్ గా సినీ రంగంలో అడుగు పెట్టిన జయలలితకు అప్పటికే ఓసారి పెళ్లి అయింది. కానీ ఆమె భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితం కొనసాగించింది. అక్కాచెల్లెల్లు, సోదరులు అంతా ఉండడంతో వారంతా తన వాళ్లే అని భావించి పెళ్లి కూడా చేసుకోలేదు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు చనిపోయాకా.. పూర్తిగా హైదరాబాద్ షిఫ్టు అయిన ఈమె రమాప్రభాకు చాలా క్లోజ్ అయింది. అలాగే ఆమె మాజీ భర్త శరత్ బాబుతో కూడా బాగానే కలిసి ఉండేది. రమాప్రభా, శరత్ బాబులను అక్కాబావా అంటూ పిలిచేదాన్నని జయలతలిత తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

Tollywood Senior Actress Jayalalitha Reveal Her Relation With Senior Hero Sarath Babu Check Details

ముఖ్యంగా అక్కకు ఏమైనా చెయ్ బావా అంటూ ఆయన్ను అడిగేంత క్లోజ్ నెస్ ఉన్న ఈమె.. ఆ తర్వాత ఆయనతో కలిసి అనేక తీర్థ యాత్రలు చేశానని చెప్పింది. అమ్మాయిని అనే తేడా చూపించకుండా.. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే తీర్థ యాత్రలకు వెళ్లే ముందు నాక్కూడా చెప్పండి.. నేను కూడా మీ వెంట వస్తానని శరత్ బాబుతో తెలిపిందట. దానికి ఆయన కూడా.. తాను తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు జయలలితకు చెప్పడం ఇలా ఇద్దరూ కలిసి వెళ్లడం జరిగేదట.

ఇలా అనేక చోట్లకు వెళ్తున్న క్రమంలోనే తమ మధ్య ప్రేమ బంధం ఏర్పడిందని.. అది చాలా కాలంగా కొనసాగగా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని స్నేహితులకు (సినీ ఇండస్ట్రీలోని వాళ్లే) చెప్పగా.. వారి శరత్ బాబుకు వద్దని చెప్పారట. కొన్నాళ్లలో తమ పెళ్లి జరిగుతుందనుకోగా.. అది ఆగిపోయినట్లు చెప్పారు. ఇది జరిగికంటే ముందు.. తామిద్దరూ పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కూడా కనాలని అన్నీ ప్లాన్ చేసుకున్నారట. అయితే శరత్ బాబుకు మాత్రం పిల్లలు అంటే కాస్త భయం ఉండేదట.

Tollywood Senior Actress Jayalalitha Reveal Her Relation With Senior Hero Sarath Babu Check Details

పైళ్లై పిల్లలు పుట్టాకా తమ ఇద్దరికీ ఏదైనా జరిగితే.. ఆస్తి కోసం పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేస్తారని భావించి వద్దనే వారట. అదే విషయాన్ని శరత్ బాబు నేరుగా జయలలితకు చెప్పారట. కానీ తమ ఇద్దరికీ పెళ్లి కూడా జరగలేదని స్పష్టం చేసింది. అయితే ఆయన చివరి రోజుల్లో ప్రతిరోజూ ఆస్పత్రికి వెళ్లేదాన్నని.. ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కూడా తనకు దక్కలేదని తెలపింది. రుణబంధం ఉన్నన్ని రోజుల్లో మనుషుల మధ్య బంధాలు అంటూ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X