వయసేమో 48.. వలపులు మాత్రం 30.. చీరలో మెరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుసా?
అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా, అత్తగా అద్భుతంగా నటించి అందరినీ మెప్పించే వాళ్లలో ముందు వరసలో ఉంటుంది నటి ప్రగతి. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అనేక సినిమాల్లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ అదిరిపోయే చీర కట్టుతో కనిపించి అందరినీ కవ్విస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1994లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత కొంత కాలానికి ఇండస్ట్రీకి బై చెప్పింది. ముఖ్యంగా 1997లో సినిమాలకు దూరం అయిన ఈమె ఆ తర్వాత మళ్లీ 2002లో సినీ రంగ పప్రవేశం చేసింది. బాబీ సినిమాలో సహాయ నటి పాత్రలో మెరిసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అందంతో పాటు టాలెంట్ కూడా ఉండడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

అలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిన ఈమె వందకు పైగా చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. అలాగే ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లోనూ అదిరిపోయే డైలాగ్స్ చెబుతూ అందరినీ మెస్మరైజ్ చేసిన ఈమె.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈమె ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఆరబోసింది.

కుంకుమ మాత్రమే పెట్టుకుని హెయిర్ లీవ్ చేసుకుని... చేతినిండా గాజులు వేసుకుని.. చాలా పద్ధతిగా ముస్తాబైంది. చెవి వద్ద చేయి పెట్టుకుని కిలాకిలా నవ్వుతూ క్రేజీగా ఫొజోలు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పెద్ద ఎత్తున నెటిజెన్లు లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
48 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్లు కూడా దాటని దానిలా కనిపిస్తున్నావని కొందరు.. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే పాతికేళ్లు, 16 ఏళ్ల వయసులో ఇంకా ఎంత అందంగా ఉండేదానివో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











