ఓ వైపు కాజల్.. మరోవైపు ఇలియానా.. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ అందుకుంటే చాలు నెంబర్ వన్ ఏ మాత్రం అవసరం లేదు. ఆ క్రేజ్ ద్వారా సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కోట్ల ఆదాయాన్ని వెనకేసుకోవచ్చు. ఇక కెరీర్ లో నిత్యం కుర్ర హీరోయిన్స్ నుంచి పోటీ ఎదుర్కోక తప్పదు. గ్లామర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు అవకాశాలు రావు. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్, ఇలాయనా వంటి భామలకు అవకాశాలు తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో మళ్ళీ పుంజుకుంటున్నారు.

వారిద్దరిదే.. అప్పర్ హ్యాండ్..
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అప్పర్ హ్యాండ్ పూజా హెగ్డేదే. ఆమెకు పోటీగా రష్మీక మందన్న ఉన్నప్పటికీ కొన్ని పెద్ద సినిమాల్లో ఎక్కువగా పూజనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మిగతా హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్స్ మెల్లగా కోలీవుడ్ ఆ తరువాత బాలీవుడ్ లో కూడా పట్టు సాధించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

అదే వారి పాజిటివ్ బలం..
అంతకుముందు వరకు స్థిరంగా ఉన్న కాజల్ అగర్వాల్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఇక ఇలియానా అక్బర్ అమర్ ఆంటోనీ సినిమా దెబ్బకు మళ్ళీ కనిపించలేదు. ఇక వీరికి ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ బలం ఏమిటంటే.. సీనియర్ హీరోయిన్స్ అనే ట్యాగ్ ఉండడమే. కొంతమంది సీనియర్ హీరోలు నేటితరం కుర్ర గ్లామర్ హీరోయిన్స్ కి ఏ మాత్రం సెట్టవ్వట్లేదు. అందుకే సీనియర్ హీరోయిన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

వారితో రిస్క్ చేయడం కన్నా..
వెంకటేష్, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలకు ఇప్పుడు కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి భామలే దిక్కవుతున్నారు. కొత్త వాళ్ళతో రిస్క్ చేయడం కన్నా జనాలు ముందుగానే అలవాటు పడిన సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. వారి నెక్స్ట్ సినిమాలకు వీరైతేనే సరైన జోడి అనుకోని ముందుకు సాగుతున్నారు.
Recommended Video

పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారట..
సీనియర్ హీరోలకు మరో అవకాశం లేదనే విషయం తెలుసుకున్న ఇలియానా, కాజల్ ఇప్పుడు రెమ్యునరేషన్ డోస్ పెంచుతున్నారట. 2కోట్లకు తక్కువ ఇస్తే ఏ మాత్రం అంగీకరించడం లేదట. మొన్నటి వరకు ఈ సీనియర్ హీరోయిన్స్ కి కోటి ఇస్తేనే ఎక్కువ అనే రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు డిమాండ్ పేరిగిందని నిర్మాతలకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారట. మరి ముందుముందు ఈ భామలు ఎలాంటి అవకశాలు అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











