Y Vijaya: "ఆ స్టార్ హీరోయిన్ అందరిముందే నా చెంపపై కొట్టింది.. నాలుగేళ్లు ఆ నొప్పి తగ్గలేదు"
టాలీవుడ్ సీనియర్ నటి వై విజయ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా నటిగానే కాకుండా నృత్య కళాకారిణిగా కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. 1970లో విడుదలైన తల్లితండ్రులు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. అప్పటి అగ్ర నటులు అందరితోనూ నటించి మెప్పించింది.
ముఖ్యంగా ఆమె ఇప్పటి వరకు 1000కి పైగా చిత్రాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాకింగ్ కామెంట్లు చేసింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెను.. మరోసారి స్టార్ హీరోయిన్ అందరి ముందే చెంపపై కొట్టిందట. కొట్టింది చేత్తోనే అయినా చాలా గట్టిగా దెబ్బ తగిలిందని.. దాదాపు మూడు, నాలుగేళ్లు ఆమె కొట్టిన చెంపపై నొప్పి తగ్గలేదని వివరించింది. మరి ఈ ముద్దుగుమ్మను కొట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం 66 ఏళ్ల వయసు కల్గిన ఈమె తన 13వ ఏటలోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. వెంపటి చినసత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం రావడంతో.. ఇండస్ట్రీకి వచ్చిందట. అయితే విజయ అదృష్టం మూలానా.. తొలి సినిమానే శోభన్ బాబు, మహానటి సావి, జగ్గయ్యల పక్కన నటించింది. మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత వరుసగా ఆఫర్లు పట్టేసింది.
అనేక సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే అనేక చిత్రాలు చేసింది. ఒక్క తమిళంలోనే 280కి పైగా చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఎన్టీఆర్, శోభన్ బాబుల సరసన కూడా నటించిన ఈమె ఇప్పటి వరకు మొత్తం వెయ్యి చిత్రాలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ కామెంట్లు చేసింది.
మహానటి సావిత్రితో కలిసి తాను ఓ సినిమా చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన గురించి వివరించింది. ఆ సినిమా షూటింగ్ లో భాగంగానే సావిత్రి.. వై విజయను చెంపపై కొట్టాల్సిన ఓ సీన్ ఉందట. అయితే ఆమె ముందే విజయ.. జాగ్రత్త నేను కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది.. అని చెప్పిందట. కానీ అది తనకు అర్థం కాక అలాగే నటిస్తుండగా.. ఆమె చెంపపై ఫట్ మని కొట్టిందట. అయితే ఆమె కొట్టగానే తనకు కళ్లు తరిగాయట.

తన ప్రమేయం లేకుండా ఏడుపు వచ్చేసిందట. అలా ఏడుస్తున్న విజయ వద్దకు వచ్చిన సావిత్రి.. ముందే చెప్పానుగా గట్టిగా తగులుతుందని.. జాగ్రత్తగా ఉండాల్సిందని వివరించిందట. అప్పుడు సరేనని ఊరుకున్న తనకు ఆ దెబ్బ తాలుకూ నొప్పి మూడు, నాలుగు ఏళ్లు ఉందట. ముఖ్యంగా చెవి కింద గట్టిగా భాగంలో తాకడంతో.. అది తగ్గడానికి చాలా ఏళ్లు పట్టిందని వివరించింది. ఇలా సావిత్రి చేత అంతటి చెంప దెబ్బ తిన్న తాను ఎవరినైనా షూటింగ్ లో కొట్టేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుందని కూడా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











