జగపతి బాబు, సౌందర్య పెళ్లి చేసుకోవాలనుకున్నారా?.. అసలు విషయం చెప్పిన ఆమని!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ఆమని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జంబలకిడి పంబ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికీ పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన ప్రాణ స్నేహితురాలు సౌందర్య, హీరో జగపతి బాబుల మధ్య ఉన్న బంధం గురించి అసలు విషయాలు చెప్పింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జగపతి బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో.. సౌందర్య కూడా అదే హోదాలో సినిమాలు చేస్తుంది. అయితే వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. చిలకపచ్చ కాపుకం, భలే బుల్లోడు, పెళ్లి పీటలు, సర్దుకుపోదాం రండి, దొంగాట వంటి చిత్రాల్లో కలిసి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇలా చాలా సినిమాల్లో వీరిద్దరూ కనిపించడం.. అందులోనూ వీరు క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Tollywood Senior Heroine Amani Clarrify About Soundarya And Jagapati babu Marriage News

ముఖ్యంగా అప్పటికే జగపతి బాబుకు పెళ్లి కావడం, ఇద్దరు పిల్లకు కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని, పెళ్లి కూడా చేసుకుంటారంటూ అనేక వార్తలు వచ్చాయి. చాలా మంది ఇవి ఇప్పటికీ నిజమని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా సౌందర్య క్లోజ్ ఫ్రెండ్ అని ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఇదే ప్రశ్న ఎదురు అయింది. ముఖ్యంగా అప్పట్లో సౌందర్య, జగపతి బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నారట కదా అంటూ అడిగారు. దీనిపై స్పందించిన ఆమని షాకింగ్ కామెంట్లు చేసింది.

జగపతి బాబు, సౌందర్య మధ్య అలాంటి బంధమేమీ లేదని.. కాకపోతే ఎక్కువ సినిమాలు కలిసి చేయడం వల్ల అలాంటి వార్తలు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా సౌందర్య చాలా మంచిది అని.. ఆమెకు తన కుటుంబ తర్వాతే మిగతా వారని చెప్పుకొచ్చింది. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తనకు ఫోన్ చేసి రమ్మని మరీ బాగా ఏడ్చిందని.. అప్పటి వరకు తండ్రి ఏం చెబితే అది విన్న సౌందర్య ఆ తర్వాత తన అన్ననే తండ్రిగా భావించిందని ఆమని వివరించింది.

Tollywood Senior Heroine Amani Clarrify About Soundarya And Jagapati babu Marriage News

అలా తన అన్న చెప్పాడనే ఓ వ్యక్తిని సౌందర్య పెళ్లి చేసుకుందని ఆమని క్లారిటీ ఇచ్చింది. తామిద్దరూ కన్నడ వాళ్ల కావడంతో తమకు స్నేహం బాగా కుదిరిందని.. తనకు పెళ్లి అయ్యాక కూడా చాలా సార్లు కలుసుకున్నామని వివరించింది. సౌందర్య చనిపోయిందని తెలిసాకా తనను తీసుకెళ్లి సౌందర్యను కాపాడి ఉంటే బాగుండని ఆ దేవుడితో మాట్లాడినట్లు కూడా వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X