కమల్ హాసన్, జయసుధ పెళ్లి చేసుకోవాలనుకున్నారా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

అలనాటి అందాల తార, సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. సహజ నటిగా పేరు పొందింది. నటించడానికి బదులుగా.. ప్రతీ పాత్రలోనూ జీవిస్తూ... తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అయితే ఒకప్పుడు స్టార్ నటిగా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె.. అప్పట్లో లోకనాయకుడు కమల్ హాసన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తొలిసారి జయసుధ కమల్ హాసన్ తో తనకు ఉన్న బంధం గురించి వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జయసుధ 1972లో పండంటి కాపురం అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా అగ్రహీరోల అందరి సరసన నటించిన ఈమె ఇప్పటి వరకు మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటిచింది. కేవలం తెలుగులోనే కాకుడా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. ఇదంతా ఒకెత్తు అయితే ఇద్దరు స్టార్ డైరెక్టర్లతోనే పాతిక చిత్రాలకు పైగా చేసింది.

Tollywood Senior Heroine Jayasudha Clarrity About Her MArriage With Kamal Haasan Chck Details

ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరోయిన్ ఈమే. అంతేకాకుండా ఒకే ఏడాదిలో ఈమె నటించి పాతిక సినిమాలు విడుదల అయ్యాయి అంటే ఈమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇంత గుర్తింపు పొందిన ఈమెపై ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. ముఖ్యంగా ఈమె లోకనాయకుడు కమల్ హాసన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ చాలా పేపర్లలో వార్తలు కూడా వచ్చాయట. అయితే తొలిసారి జయసుధ ఆ వార్తలపై స్పందించింది. కమల్ తో తనకు ఉన్న బంధాన్ని వెల్లడించింది.

కమల్ హాసన్ తాను ఎక్కువగా కలిసి సినిమాలు చేసే వాళ్లం అని.. అయితే ఆ చిత్రాలకు సబంధించిన ఏవైనా ఈవెంట్లు, ఫంక్షన్లు జరిగితే అక్కడ... తాను పాటలు పాడేదాన్నని వివరించింది. అయితే తనతో పాటుగా కమల్ హాసన్ కూడా పాటలు పాడేవారని.. అలా తమ జంట ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పుకొచ్చింది. అయితే తమ జంట ఎక్కువ మందికి నచ్చడంతో... తాములా ఎప్పుడూ పాటలు పాడడంతో.. పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయని వివరించింది.

Tollywood Senior Heroine Jayasudha Clarrity About Her MArriage With Kamal Haasan Chck Details

ముఖ్యంగా మీడియా వాళ్లకు... ఏదైనా రాస్తేనే వ్యూస్ వస్తాయి కాబట్టి.. లేనిపోనివి కల్పించి రాశారని జయసుధ పేర్కొంది. కానీ తామిద్దరూ కలిసి చేసిన సినిమాల్లో తమ జంట బావుండేదని.. తమ జోడీని ఎక్కువ మంది ఆదరించడం వల్లే ఎక్కువ సినిమాలు కలిసి చేశామని కూడా జయసుధ క్లారిటీ ఇచ్చింది. అందుకే తాను ఇప్పటికీ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వనని.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతుంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసు కల్గిన జయసుధ ఇప్పటికీ సినిమాలు చేస్తూ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X