రెండవ భర్త సూసైడ్ పై నోరు విప్పిన స్టార్ హీరోయిన్..మళ్లీ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్ చాలా వేరైటిగా ఉంటాయి. సినీ సెలబ్రిటీల జీవితంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా సర్వసాధారణం. ఇటీవల 65 ఏళ్ల వయసులో అలనాటి ఓ హీరోయిన్ మూడో పెళ్లికి సిద్దమవుతోందనే వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ నటి తన రెండవ భర్త సూసైడ్ పై నోరువిప్పింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే? తన రెండో భర్త సూసైడ్ కారణాలేంటీ ? అనే వివరాల్లోకెళ్తే..
ఆ హీరోయిన్ ఎవరో కాదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు సొంతం చేసుకున్న జయసుధ (Jayasuda). ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది జయసుధ. సీనియర్ ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు ఎంతమంది అగ్ర హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో కలుపుకొని దాదాపు 300 సినిమాలకు పైగా నటించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పలుమార్లు తల్లి పాత్రల్లో నటిస్తూ వాటికి ప్రాణం పోసింది సహజ నటి జయసుధ. జయసుధ కేవలం నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రొఫెషల్ కెరీర్ ను సక్సెస్ గా రాణించినా.. కానీ, పర్సనల్ కెరీర్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. తొలుత ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరిడితో జయసుధ వివాహం జరగగా.. మనస్పర్థాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 1985లో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాతను నితిన్ కపూర్ ను రెండవ వివాహం చేసుకుంది.
వీరికి నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి హీరోయిన్ జయసుధ ఒంటరిగా జీవిస్తోంది. ఇలా సెలక్టివ్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. అదే సమయంలో జయసుధ మూడో పెళ్లంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ వార్తలపై సహజనటి జయసుధ స్పందించింది. తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది. అలాగే. తన భార్య సూసైడ్ పై క్లారిటీ ఇచ్చింది జయసుధ.
తాజాగా సహజ నటి జయసుధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ యాంకర్ మాట్లాడుతూ.. మీ భర్త చావుకు మీరేనా కారణం అంటున్నారని నేరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జయసుధ షాక్ అయింది. తొలుత తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ ను కొట్టేవేసింది. ఆ తరువాత తన భర్త నితిన్ కపూర్ మరణంపై స్పందిస్తూ.. తమకు ఎలాంటి అప్పులు లేవని, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తనకు కూడా తెలియదని అన్నారు జయసుధ. తన వల్లో, అప్పుల సమస్య వల్లో మాత్రం ఆయన చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
అలాగే.. తన భర్త ప్రొడ్యూస్ చేసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమేననీ, అందులో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా.. మూడు సినిమాలు హిట్లుగా నిలిచాయని చెప్పుకొచ్చింది. మరీ అన్నీ అమ్మేసుకుని స్థాయిలో అప్పులు ఏం లేవని మరీ మరీ చెప్పింది. అయితే తన భర్త డిప్రెషన్ లోకి వెళ్లారనీ, తన భర్త సోదరుడు కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని జయసుధ వెల్లడించింది. నితిన్ కపూర్ మృతికి కూడా కారణాలు తెలివీని.. తన అత్తగారింట్లో ఇలా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యామని తెలిపారు.


Click it and Unblock the Notifications











