Jeevitha Rajashekhar: "నేను సినిమాలు మానేయడానికి కారణం నా భర్త రాజశేఖరే"
జీవితా రాజశేఖర్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో హీరోయిన్ గా మెరిసింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్నప్పుడే సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఇంతకాలం ఆమే సినిమాలు ఎందుకు ఆపేసిందో చెప్పలేదు. కానీ తొలిసారిగా తాను నటనకు ఎందుకు దూరం అయిందో చెప్పింది. ముఖ్యంగా తన భర్తే తాను సినిమాలు ఆపడానికి కారణం అని వెల్లడించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
1986లో తలంబ్రాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆహుతి, ఇదా ప్రపంచం, డామిట్ కథ అడ్డం తిరిగింది, రాక్షస సంహారం, అన్నా చెల్లలు, ఇంద్రధనస్సు, జానకిరాముడు, నవభారతం, బావా మరదళ్ల సవాల్, స్టేషన్ మాస్టర్, మంచివారు మావారు, అంకుశం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా తన కెరియర్ గ్రాఫ్ పెరుగుతున్న సమయంలోనే ఈమె హీరో రాజశేఖర్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత కొంత కాలానికే సినిమాలకు దూరం అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి జీవితా రాజశేఖర్ షాకింగ్ విషయాలు చెప్పింది. తాను రాజశేఖర్ తో ప్రేమలో పడడం, పెళ్లి ఆ తర్వాత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా తాను రాజశేఖర్ ను ప్రేమించాకా.. పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు చెప్పింది. అయితే తన ఇంట్లో వాళ్లు త్వరగానే పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ... రాజశేఖర్ కుటుంబ సభ్యులు అస్సలే ఒప్పుకోలేరట. ఆస్తిలో, అందంలో, అన్నింట్లో జీవిత వాళ్లకంటే వాళ్లు హై లెవల్ లో ఉండడంతో జీవితను కోడలిగా వద్దని భావించారట.

కానీ రాజశేఖర్ మాత్రం తాను పెళ్లంటూ చేసుకుంటే జీవితనే చేసుకుంటానని పట్టుబట్టడంతో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారట. అప్పుడే జీవిత డిసైడ్ అయిందట. తన అత్తయ్య గారింట్లో అందరితో ఈమెను మంచిన కోడలు లేదని అనిపించుకోవాలని. అందుకే సినిమాలకు కూడా పూర్తిగా దూరం అయి కేవలం కుటుంబ బాధ్యతలు, భర్త, అత్త మామలను చక్కగా చూసుకోవాలని ఫిక్స్ అయిందట. అలా తాను సినిమాలకు దూరం అయిందట.
అదే విషయాన్ని భర్త రాజశేఖర్ కు చెప్పగా ఆయన కూడా నీ ఇష్టం అన్నారట. అలా సినిమాలు చేయడం మానేసిన జీవితా రాజశేఖర్.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, పిల్లలు ఇంటి బాధ్యతల్లోనే మునిగిపోయింది. ఇలా అందరి నోట రాజశేఖర్ కు సరైన భార్య అనిపించుకుంది. ఇప్పుడిప్పుడు ఆమె మళ్లీ సినిమాలు చేస్తోంది. ఇటీవలే లాల్ సలామ్ సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. మరి ముందు ముందు ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











