ఎడారిలో హీటెక్కిస్తున్న ఈ 47 ఏళ్ల తెలుగందం ఎవరో గుర్తు పట్టారా..?

అచ్చమైన తెలుగు అమ్మాయి.. అలనాటి అందాల తార రంభ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకల అందానికి ఏమాత్రం తీసిపోని ఈ హాట్ బ్యూటీకి పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ హాయిగా గడిపేస్తుంది. హౌస్ వైఫ్ గా కొనసాగుతూ.. భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో పుట్టిన ఈమె.. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.

ది గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ రంగానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అందం, అభినయం చూసిన ఎంతో మంది ఈమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఈ క్యూట్ బ్యూటీ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కేవలం ఇవి మాత్రమే కాకుండా బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, బంగారు కుంటుంబం, ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇలా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

Tollywood Senior Heroine Rambha Stunning Hot Look Photos Goes Viral

కేవలం నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్ గా కూడా ఈమెకు పేరు వచ్చింది. కొన్ని తెలుగు సినిమాల్లో ప్రత్యేక నృత్యం కూడా చేస్తూ.. అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల వయసు కల్గిన ఈమెను చూస్తే పాతికేళ్ల వయసుకు మించి ఉండదని అనుకుంటారు. అంతటి అందం ఈమె సొంతం. అంతే అందంగా, అంతే ఫిట్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. సినమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా భర్త, పిల్లలతో కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లింది. అక్కడ ఎడారిలో అందమైన ఫొటోలు దిగింది. రంభ ఒక్కతే కాకుండా భర్త, పిల్లలతో కలిసి కూడా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది వాటినే ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ అదే తరగని అందం అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Read more about: rambha రంభ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X