47 ఏళ్ల వయసులోనూ తెగించిన తెలుగందం.. గుభాలించే అందాలతో గమ్మత్తు చేస్తున్న మెగాస్టార్ హీరోయిన్!

రంభ, ఊర్వశి, మేనకలు.. ఇంద్రలోకంలోనే ఉంటారని అంతా అనుకుంటారు. కానీ అక్కడే కాదు భువిపై కూడా ఈ అందగత్తెలు ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ ముగ్గురూ ఉండడం గమనార్హం. రంభ.. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో ఆకట్టుకుంటుందని అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపని రంభ.. పెళ్లై, ఇద్దరు పిల్లల తల్లిగా మారాకా సినిమాలకు దూరం అయింది. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఈమె.. డైరెక్టర్ ఇ.వి.వి సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.

ఇక ఆ తర్వాత నుంచి ఆమె అందం, అభినయం చూసి వరుసగా అవకాశాలు ఇచ్చారు దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కల్పించారు. ఇలా అద్భుతమైన అవకాశాలు కొట్టేసిన ఈమె... అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి పక్కన నటించి మెప్పించింది. ఇప్పిటకీ తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేని నటనను చూపించింది. అదొక్కటే కాదు... బొంబాయి ప్రియుడు సినిమాతో జేడీ చక్రవర్తి సరసన కూడా అదరగొట్టింది.

Tollywood Senior Heroine Rambha Stunning Look Photos Goes Viral

బావగారూ బాగున్నారా, ముద్దుల ప్రియుడు, బంగారు కుటుంబం, ఏవండీ ఆవిడ వచ్చింది, హలో బ్రదర్, హిట్లర్, ఇదద్రు మిత్రులు, మమూడు ముక్కలాట, పెళ్లిగోల.. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అందరి చేత ఆహా అనిపించుకుంది. సినిమాలు చేస్తున్నప్పుడు ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఇద్రన్ పద్మనాథన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా మారిపోయింది. ఇక అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ సినిమాలకు దూరం అయింది.

కానీ తనను అభిమానించే వారి కోసం సోషల్ మీడియా వేధికగా అందుబాటులోనే ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు హీటెక్కిస్తుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో చెబుతూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందమైన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపించిన రచ్చ చేసింది. రంభ అందాలు చూసిన నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.

Tollywood Senior Heroine Rambha Stunning Look Photos Goes Viral

పెళ్లై, పిల్లలు ఉన్నా.. 47 ఏళ్ల వయసు వచ్చినా నీ అందాలు మాత్రం అస్సలే తగ్గట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను చూడాలంటే అదృష్టం ఉండాలంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి అందాల తార రంభ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Read more about: rambha రంభ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X