44 ఏళ్ల వయసులో సమీరా రెడ్డి సంచలనం.. అది అసలు బాడీయేనా?
సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లు సక్సెస్‌లు ఉంటేనే సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీల్లో కొనసాగుతారు. లేకుంటే ఆఫర్లను అందుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఈ జాబితాలోకే వస్తుంది తెలుగు నటి సమీరా రెడ్డి. టాలీవుడ్‌లో కొన్నేళ్ల పాటు హీరోయిన్‌గా సందడి చేసిన ఈ అమ్మడు.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేపోయింది. ఫలితంగా సినిమాలకు దూరం అయిపోయింది. ఈ మధ్య కాలంలో సమీరా రెడ్డి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ ఊహించని ఫొటోను వదిలింది. అది చూసి మీరే షాక్ అవండి మరి!
తెలుగు భామ.. అలా ఎంటర్
సమీరా రెడ్డి తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ భామ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని ఫుల్ పాపులర్ అయింది.

టాలీవుడ్ కెరీర్ డిజాస్టర్‌గానే
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో సమీరా రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసింది కానీ ఇది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసింది. ఇది కూడా డిజాస్టర్‌గా మిగిలింది.

అక్కడ చేసి.. ఆ సాంగ్‌లోనూ
సమీరా రెడ్డి తెలుగులో మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో టాలీవుడ్‌కు దూరం అయింది. కానీ, హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి అలరించింది. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా నటించిన 'కృష్ణం వందే జగద్గురం' సినిమాలో ఐటెం సాంగ్‌తో తెలుగులో తళుక్కుమంది.
వైవాహిక జీవితంలో సక్సెస్
హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయిన సమీరా రెడ్డి 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీతోనే గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో బిజీగా
సుదీర్ఘ కాలం పాటు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన, తన ఫ్యామిలీ ఫొటోలను వదులుతోంది.

అలాంటి ఫొటోలతో రచ్చ
సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తోన్న పిక్స్‌ను షేర్ చేస్తుండేది. అంతేకాదు, ఈ అమ్మడు గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ ట్రీట్ ఇచ్చి సెన్సేషన్ అయింది. అదే ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
సమీరా వర్కౌట్ పిక్ వైరల్
తాజాగా సమీరా రెడ్డి వర్కౌట్ చేస్తూ తీసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న షార్ట్, క్యాజువల్ టాప్ ధరించి.. కుర్చీకి శరీరం మొత్తాన్ని చుట్టేసి కనిపించింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అదే సమయంలో చాలా మంది 'ఇది అసలు బాడీయేనా లేక బబుల్‌గమ్మా' అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











