తొలిసారి బికినీలో ఎన్టీఆర్ అశోక్ హీరోయిన్: 45 ఏళ్ల వయసులో అందాల ఆరబోత

సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మిగిలిన వాళ్లంతా ఫెయిల్ అవుతుంటారు. ఈ రెండో కోవకే చెందుతుంది తెలుగు హీరోయిన్ సమీరా రెడ్డి. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో విజయాలను పెద్దగా అందుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను కూడా అలరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమీరా రెడ్డి కొన్ని బోల్డు పిక్స్ వదిలింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి!

తెలుగు అమ్మాయే అక్కడ
తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే సమీరా రెడ్డి జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ భామ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది.

Tollywood Senior Heroine Sameera Reddy Latest Sizzling Photos Gone Viral

టాలీవుడ్ డిజాస్టర్ బ్యూటీ
సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా కానీ ఇది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసినా ఇదీ డిజాస్టరే అయింది.

వైవాహిక జీవితంలో హిట్
సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన సమీరా రెడ్డి 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అలా మాత్రం కాలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీతోనే గడుపుతూ చిల్ అవుతోంది.

Tollywood Senior Heroine Sameera Reddy Latest Sizzling Photos Gone Viral

సోషల్ మీడియాలో బిజీ
ఎంతో కాలం పాటు సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా మూవీలు లేకున్నా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

అలాంటి ఫొటోలు వదిలి
సోషల్ మీడియాలో సమీరా రెడ్డి ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా గ్లామరస్ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తోన్న పిక్స్‌ను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఈ అమ్మడు గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ ట్రీట్ ఇచ్చి సెన్సేషన్‌గా మారింది. అదే ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

Tollywood Senior Heroine Sameera Reddy Latest Sizzling Photos Gone Viral

సమీరా బికినీ పిక్స్ వైరల్
సమీరా రెడ్డి తాజాగా బీచ్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఈ భామ టూ పీస్ బికినీని ధరించి కనిపించింది. ఫలితంగా ఈ పిక్స్‌లో ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా సమీరా రెడ్డి షేర్ చేసిన అన్ని విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X