వయసేమో 52.. వయ్యారాలు మాత్రం 20.. ఈ టాలీవుడ్ టాప్ బ్యూటీని గుర్తు పట్టారా?

టబు... ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో మారుతుంది హార్ట్ బీటు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఒకప్పుడు తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపింది. తన అందం, అభినయంతో అనేక సూపర్ హిట్ సినిమాల్లో కనిపించి కుర్రకారును కట్టి పడేసింది. ముఖ్యంగా నిన్నేన పెళ్లాడతా సినిమాలో నిజమైన యాపిల్ పండులా కనిపించిన ఈమె ఇప్పటికీ అలాగే నిగనిగలాడుతోంది. ప్రస్తుతం 52 ఏళ్ల వయసు వచ్చినా 20 ఏళ్ల కుర్రదానిలా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా వెస్ట్రన్ డ్రెస్ లో వయ్యారాలు ఆరబోసిన ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అచ్చమైన తెలుగు, హైదరాబాద్ లో పుట్టి పెరిగన అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది టబు. సినీ రంగంలోకి అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. హీరోయిన్ గా కొనసాగుతూనే వస్తోంది. ముఖ్యంగా కూలీ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత కూడా అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాళీ భాషల్లో కూడా నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కెరియర్ మొదట్లో కాస్త బ్రేకులు ఇస్తూ సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు వసరుసగా చేసుకుంటూ వస్తోంది.

Tollywood Senior Heroine Tabu Mesmerizing Pics Goes Viral

గతేడాది ఎలాంటి సినిమాలోనూ కనిపించని టబు.. తాజాగా క్రూ సినిమాలో నటించి మెప్పించింది. భారీ ఎత్తున వసూళ్లు రాబట్టుకుంటున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంలో ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా.. కుర్రహీరోయిన్ లా గ్లామర్ షో చేసింది. ఓవైపు వరుసగా చిత్రాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండే ఈమె.. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది.

అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అందమైన అదిరిపోయే ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో ట్రెండీ జీన్స్ విత్ ఫుల్ గ్లామర్ షో చేస్తూ కనిపించింది. అలాగే జుట్టును కూడా లీవ్ చేసి అదిరిపోయే స్టైల్ లో దర్శనం ఇచ్చింది. అయితే ఈ ఫొటో షూటింగ్ సమయంలో దిగినట్లు చెప్పుకొచ్చింది. ఓ సింపుల్ లాంగ్ చైన్ తో పాటు సింపుల్ ఇయర్ రింగ్, ఫింగర్ రింగ్ పెట్టుకుని మరింత అందంగా కనిపిస్తోంది.

Tollywood Senior Heroine Tabu Mesmerizing Pics Goes Viral

టబు షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూనే.. 52 ఏళ్ల వయసులో మరీ ఇంత కుర్రదానిలా కనిపిస్తున్నావేంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటికీ తరగని అందాలతో నిగనిగలాడుతున్న నిన్ను చూస్తే భలే అనిపిస్తుందంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X