Vimala Raman: జారే చీరలో జాబిలమ్మాలా విమలా రామన్.. 42 ఏళ్ల వయసంటే నమ్మడం కష్టమే!

సినీ ఇండస్ట్రీ అంటేనే అందం, అభినయం. ఈ రెండు ఉన్న వాళ్లకు వచ్చే స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఆడాళ్లు, మగాళ్లు అంతా అందాన్ని కాపాడుకోవడానికి తెగ కష్టపడిపోతుంటారు. ముఖ్యంగా తమకు నచ్చిన అహార పదార్థాలకు కూడా దూరంగా ఉంటూ గ్లామరస్ గా కనిపిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఒకరే టాలీవుడ్ సీరనియర్ హీరోయిన్ విమలా రామన్. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పదహారేళ్ల పడుచు పిల్లలానే కనిపిస్తుంటుంది. ఎలాంటి డ్రెస్ వేసిని ఆమె అందం మరింత పెరిగిపోతుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ జారే చీరలో జాబిలమ్మాలా మెరిసిపోయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ ప్రియులు అందరికీ విమలా రామన్ గురించి, ఆమె అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2006లో పోయి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయం కనబర్చిన ఈమె.. ఆ తర్వాతి సంవత్సరమే మలయాళ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. అలా టైం అనే సినిమా చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. ఇటు తెలుగు, అటు మలయాళ భాషల్లో రచ్చ చేసింది.

Tollywood Senior Heroine Vimala Raman Stunning Saree Look Photos Goes Viral

ముఖ్యంగా వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఎవరైనా ఎపుడైనా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత గాయం 2తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇఖ అప్పటి నుంచి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ చాలానే సినిమాలు చేసింది. ముఖ్యంగా రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేకంటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జున వంటి చిత్రాల్లో నటించింది. ఇలా అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ముద్దుగుమ్మ విమలా రామన్. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. దమ్ము రేపుతుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో జారే చీర కట్టుకుని నెరజానలా వయ్యారాలు ఒలకబోసింది.

Tollywood Senior Heroine Vimala Raman Stunning Saree Look Photos Goes Viral

నేవీ బ్లూ కలర్ జార్జెట్ చీర కట్టుకుని.. ఓ డైమండ్ నెక్లెస్ నను స్టైల్ చేసింది. అలాగే దానికి మ్యాచింగ్ డైమండ్ ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్, ఫింగర్ రింగ్స్ పెట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. అదిరిపోయే ఫోజులు పెడుతూ.. గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం విమలా రామన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 42 ఏళ్ల వయసులోనే ఇంతందంగా ఉన్నావంటే 16 ఏళ్ల ప్రాయంలో ఇంకెలా ఉన్నావో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X