కాజల్‌కు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? షాక్ అవుతున్న టాలీవుడ్

Recommended Video

Kajal Aggarwal Facing Miserable Situation In Tollywood || Filmibeat Telugu

ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత హిట్ అనే మాటను వినలేకపోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వ్యవహిరిస్తున్న తీరుకు తెలుగు సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది.

రాజుగారి గది ఆఫర్

రాజుగారి గది ఆఫర్

దర్శకుడు ఓంకార్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘రాజుగారి గది 3' ఇటీవల పూజ కార్యక్రమాలతో అధికారికంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నారు. షూటింగ్ మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక చిత్ర యూనిట్ తాప్సిని ఫైనల్ చేసినట్లు మరో టాక్ వచ్చింది. కానీ, ఆమె కూడా చేయననడంతో కాజల్ పేరు తెరపైకి వచ్చింది.

ఆఫర్ తిరస్కరించింది

ఆఫర్ తిరస్కరించింది

అనుకున్న ఇద్దరు హీరోయిన్లు హ్యాండ్ ఇవ్వడంతో ‘రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు చేయడానికి ముందు ఓకే చెప్పిందట కాజల్. అయితే, అందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో షాకైన ఓంకార్ చేసేదేం లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

హిట్స్ లేకున్నా.. ఎందుకిలా..?

హిట్స్ లేకున్నా.. ఎందుకిలా..?

తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి' తర్వాత కాజల్‌కు హిట్ లేదు. ఆ తర్వాత ఆమె చేసిన ‘కవచం', ‘సీత' సినిమాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. దీంతో ఇక కాజల్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం వచ్చిన అవకాశాన్ని ఇలా వదులుకోవడం చర్చనీయాంశం అవుతోంది. కాజల్ వ్యవహరిస్తున్న తీరుకు టాలీవుడ్ షాక్ అవుతోంది.

తేజతో సినిమా ప్లాన్ చేస్తుందా.?

తేజతో సినిమా ప్లాన్ చేస్తుందా.?

తనను ‘లక్ష్మీ కల్యాణం' ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ అంటే కాజల్‌కు ఎంతో ఇష్టం. అందుకే ఆయనతో సినిమా అంటే వెంటనే ఓకే చేసేస్తుంది కాజల్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయనతో మరోసారి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తుందట ఈ టాలీవుడ్ చందమామ. అయితే, ఈ సారి హీరోయిన్‌గా మాత్రం కాదు.. నిర్మాతగా పరిచయం కాబోతుందట. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఇండస్ట్రీలో టాక్.

భారతీయుడు 2 కష్టమేనా..?

భారతీయుడు 2 కష్టమేనా..?

ప్రస్తుతం కాజల్ నటిస్తున్న చిత్రం ఏదైనా ఉందా అంటే విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2' అనే చెప్పాలి. ఈ సినిమాను బడా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడికి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అసలు ఈ సినిమా ప్రారంభవుతుందా..? లేదా అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X