Sai Pallavi: సాయిపల్లవికి ఇంతకు ముందే పెళ్లై పోయిందా... లీక్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో!
రీసెంట్గా సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అక్కకు పెళ్లి కాకుండానే చెల్లి పెళ్లి చేసుకుంటోందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పెళ్లి టాపిక్ కూడా ట్రెండింగ్‌గా మారింది. అయితే సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని ఓ టాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. దాని గురించే ఈ కథనం.
సాయి పల్లవి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి చిత్రంతోనే సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం సహా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ నేచురల్ యాక్టింగ్‌తో పాటు అంతకు మించిన డ్యాన్స్‌తో బాగా క్రేజ్ తెచ్చుకుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది.

అయితే సాయిపల్లవి తన సినిమా విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయటకు రాకుండానే చూసుకుంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా సాయి పల్లవి పెళ్లి వార్తలు కాస్త ఎక్కువగా వినిపించాయి. దీంతో చాలా మంది ఏంటి సాయి పల్లవి పెళ్లి అయిపోయిందా అంటూ షాక్ కూడా అయ్యారు.
గతంలో పెళ్లి ఫొటో : ఆ మధ్య అయితే సాయి పల్లవి, ఓ వ్యక్తి.. మెడలో దండలు వేసుకుని పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటో కూడా బాగా వైరల్ అయింది. అయితే దీనిపై విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల క్లారిటీ ఇచ్చాడు. అది ఓ సినిమా పూజా కార్యక్రమంలోనిదని స్పష్టత ఇచ్చాడు. దీంతో ఆమె సీక్రెట్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది.

ఇప్పుడు వీడియో : ఇప్పుడేమో రీసెంట్గా సాయి పల్లవి చెల్లి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మళ్లీ ఆమె పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఓ పాత వీడియో వైరల్ అయింది. అదేంటంటే సాయి పల్లవి గతంలో తెలుగులో నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ అనే రెండు చిత్రాలు చేసింది. అయితే శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాని, సాయి పల్లవి కలిసి పాల్గొన్నారు.
ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ : ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ సాయి పల్లవికి ఎప్పుడో పెళ్లైపోయిందని సరదాగా అన్నారు. నాని మాటలకు నవ్వుకున్న సాయి పల్లవి ఈ వీడియో మా అమ్మ చూస్తే మాత్రం నీ పని అంతే.. కచ్చితంగా నీకు ఫోన్ చేస్తుంది అంటూ బదులిచ్చింది. దీనిని నాని కూడా.. చేస్తే చేయని నేను మాట్లాడతాను ఆంటీతో అంటూ సరదాగా తిరిగి అన్నారు. ఇప్పడీ వీడియో మళ్లీ నెట్టింట్లో వైరల్ అవ్వడం వల్ల సాయి పల్లవికి పెళ్లి అయిపోయిందా అంటూ కొంతమంది నెటిజన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











