Samantha: స్టైలిష్ లుక్‌లో సమంత స్టన్నింగ్ ఫోజులు.. బాత్రూంలో మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో కుర్రకారు మనసు దోచిందీ క్యూట్ బ్యూటీ. ఇప్పటికీ యువకలు గుండెల్లో ప్రత్యేక స్థానం కల్గిన ఈమె.. వారి కోసమే అన్నట్లుగా సోషల్ మీడియా వేధికగా తన అందమైన ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తూ బాత్రూంలో ఫొటోలు దిగిందీ ముద్దుగుమ్మ. అదిరిపోయే ఫోజులు పెడుతూ రచ్చ చేయగా.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2010లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, మహానటి, ఓ బేబీ, జాను వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మయోటైటిస్ అనే సమస్యతో బాధ పడుతున్న ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేధికగా ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలు పోస్ట్ చేస్తూనే వస్తోంది.

Tollywood Star Heroine Samantha Ruth Prabhu Mirror Selfie Pics Goes Viral

కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో అడుగు పెట్టి 14 ఏళ్ల అవుతున్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ఆరోగ్యం బాగాలేక బ్రేక్ ఇచ్చింది కానీ.. లేకపోతే వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండేదే. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది.

అందులో బ్లూ కలర్ జీన్స్ పైకి వైట్ కలర్ టాప్ వేసుకుంది. బెలూన్ హాండ్స్ తో చాలా స్టైలిష్ గా ఉన్న ఈ టాప్ లో సమంత స్టన్నింగ్ షో చేసింది. ముఖ్యంగా బాత్రూంలో ఉండగానే.. మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ రెచ్చిపోయింది. మొత్తంగా ముందుకు వాలి మరీ తన అందాలను అద్దంలో చూసుకుంది. అదిరిపోయే ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. ఓ సింపుల్ ఫింగర్ రింగ్ తో యమా స్టైలిష్ గా ఉందీ సామ్. వైట్ కలర్ టాప్ లో సామ్ అందాలు చూస్తు ఎవర్రైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.

సమంత షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావు, త్వరగా సినిమాలు చెయ్ సామ్ అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X