జవాన్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్... ఎందుకో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లోకి రాగా... పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక షారుఖ్ ఖాన్ కు జోడిగా నయన తార నటించగా... విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఇక ఈ సినిమాలో నయనతార కంటే ముందుగా మరో హిరోయిన్ ను అనుకున్నారట. ఆ హీరోయిన్ పలు కారణాల చేత ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
పఠాన్ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్... ఇప్పుడు జవాన్ తో గ్లోబల్ హిట్టును అందుకోబోతున్నాడు. పఠాన్ సినిమా రికార్డులను కొల్లగొట్టబోతున్నాడని ట్రెడ్ అనాలిస్టుల అంచనా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా లేడి సూపర్ స్టార్ నయన తార నటించింది. అయితే ఈ హీరోయిన్ కంటే ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట.

దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ చిత్రంలో మొదట హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను అనుకున్నారట. 2019లో జవాన్ సినిమా కోసం సామ్ ను సంప్రదించగా అప్పటి కమిట్ మెంట్స్ కారణంగా తిరస్కరించిందని తెలుస్తోంది. ఒకవేళ సమంత ఈ సినిమా ఒప్పుకొని ఉంటే బాలీవుడ్ లో మంచి బ్రేక్ దొరికేదని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.
అట్లీ దర్శకత్వం వహించిన మెర్సెల్.. తెలుగులో అదిరింది... తేరి తెలుగులో పోలీసొడు చిత్రాల్లో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ అనుబంధం కారణంగానే దర్శకుడు అట్లీ సమంతను సంప్రదించారని తెలుస్తోంది. అయితే సమంతకు అప్పడు ఉన్నసినిమాల కారణంగా ఒప్పుకోలేదు. ఇక తను ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇటీవల సమంత ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక జవాన్ చిత్రంలో నయనతార నటించింది. హిందీ చిత్రసీమలో తన తొలి సినిమా ఇది. మొదటి సారిగా ఆమె షారుఖ్ ఖాన్ సరనస నటించింది. ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నయనతార కనిపించింది. ఇక షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ నటించారు. ఇండియాలోని అవినీతి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

జవాన్ సినిమాలో జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించగా... బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరిసింది. అంతే కాదు.. పవర్ ఫుల్ రోల్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్త్ కనిపించారు. ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ రూ.300కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











