ఐదేళ్లు అజ్ఞాతంలో.. ఆత్మహత్యాయత్నం.. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా మారిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ యమున గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గానే కాకుండా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఈమె.. అనే సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కానీ ఓ ఇన్సిడెంట్ తో ఆమె జీవితమే మారిపోయింది. ఆ ఒక్క సంఘటనతో ఐదేళ్లు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిన ఈమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ఆ విశేషాలు ఏంటి ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు సినీ ప్రియులకు ఎంతగానే దగ్గర అయింది నటి యమున. అందానికి అందం, అభినయానికి అభినయం కల్గిన ఈ క్యూట్ బ్యూటీ 2011లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లోల వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో విటుడిగా ఓ సాఫ్ట్ వేర్ కంపేనీ సీఈఓను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత యమున పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.

Tollywood Star Heroine Yamuna Said How She Come Out THe Depression Check Details

ఈ సంఘటన జరిగిన తర్వాత ఏడాది అంటే 2012లో కూడా ఇవే వార్తలు కొనసాగాయని.. దీంతో పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిన తనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఆస్పత్రి నుంచి రేపు డిశ్చార్జ్ అవుతున్నామనగా... టీవీలో మరోసారి తనకు సంబంధించిన వార్తలు చూపించగా.. మళ్లీ తన పరిస్థితి మొదటికి వచ్చిందని చెప్పింది. దీంతో తన ఫ్యామిలీ మొత్తం తమిళనాడుకు ఫిష్టు అయ్యామని.. అక్కడికి వెళ్లాకా కూడా మొహం మీదే తనను అవమానించగా.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది.

కానీ తన పిల్లలు అప్పటికి చిన్నగా ఉండడంతో.. తన స్నేహితురాలు అది తప్పని.. నీ పిల్లల కోసమైనా నువ్వు బతకాలని చెప్పిందని.. అలా ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మొత్తం ఐదేళ్ల అజ్ఞాతంలోకి వెళ్లినట్లు యమున స్పష్టం చేసింది. ఆ తర్వాత తన పిల్లలే తనకు ధైర్యం చెప్పడం ప్రారంభించారని.. అలా దైవపూజలో పూర్తిగా తాను బయటకు వచ్చినట్లు స్పష్టం చేసింది. బుద్ధుడి సూచనలు పాటిస్తూ.. ఇప్పుడు మొహం మీదే ఎవరైనా తిట్టినా పట్టించుకోకుండా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.

Tollywood Star Heroine Yamuna Said How She Come Out THe Depression Check Details

ప్రస్తుతం సినిమాలు చేయాలనుకుంటున్నానని.. గతంలో జరిగిన వేటినీ కూడా పట్టించుకోకుండా.. ధర్మ మార్గంలో తన జీవితం కొనసాగించాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది. తన చిన్నప్పటి నుంచే పెళ్లి చేసుకోకుండా... దైవ మార్గంలో కొనసాగాలనుండేదని.. కానీ తన తల్లి వద్దని పెళ్లి చేసుకోవాలని, పెళ్లయ్యాక నీకు ఎలా నచ్చితే అలా ఉండాలని చెప్పగా.. పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X