బాత్‌టబ్‌లో సమంత షాకింగ్ షో: స్నానం చేసే ఫొటోలు వదిలిందేంటి!
Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశించి.. మొదటి చిత్రంలో నటన, అందంతో ప్రేక్షకులను అందరినీ మాయ చేసేసిన బ్యూటీ సమంత రూత్ ప్రభు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయిన ఈ చిన్నది.. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో మాత్రం అనారోగ్యం కారణంగా కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!
వరుస ఫ్లాపులతో ఇబ్బంది: ఒకప్పుడు గ్లామర్ రోల్స్‌కు జై కొట్టిన సమంత.. ఈ మధ్య కాలంలో మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది 'యశోద' చిత్రంతో వచ్చి బిగ్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం వరుసగా 'శాకుంతలం', 'ఖుషి' మూవీలు చేసింది. కానీ, ఈ రెండూ పరాజయం పాలవడంతో ఆమెకు షాక్‌లు తగిలాయి.

ఆ సిరీస్ ఒక్కటే చేసింది: అసలు సినిమా హిట్టా ఫట్టా అన్న తేడా లేకుండా సమంత రూత్ ప్రభు చాలా కాలంగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె కాస్త స్పీడ్ తగ్గించింది. ఇప్పుడు ఆమె 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. ఇది తప్ప సమంత ఒక్క సినిమాకు కూడా సంతకం చేయలేదు.

ఆరోగ్యంపైనే ఫోకస్ చేస్తూ: సమంత రూత్ ప్రభు చాలా కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి కోసం సమంత కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా వైద్యం చేయించుకుంటూ సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం దీని నుంచి కోలుకోవడం కోసమే సామ్ ఎక్కువ శ్రద్ద చూపుతోంది.

ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది: చాలా కాలంగా వరుసగా సినిమాలు చేసి.. ఈ మధ్యన కాస్త స్లో అయిన సమంత సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను తరచూ పలకరిస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఈ స్టార్ హీరోయిన్ తన సినీ, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా సినిమాలు లేకున్నా వాళ్లను సంతోషపరుస్తోంది.
ఖాళీ సమయంలో కేకలా: సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గ్లామర్ రోల్స్ చేసిన సమంత.. ఈ మధ్య కాలంలో మాత్రం డీసెంట్ పాత్రల్లోనే నటిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను వదులుతోంది. ఇటీవలి కాలంలో అయితే వరుసగా ఫొటోషూట్లు చేస్తూ రెచ్చగొట్టేస్తుంది.

బాత్‌టబ్‌లోనూ సమంత: సమంత రూత్ ప్రభు.. కొద్ది రోజులుగా తన అందచందాలతో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపి పడేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బాత్‌టబ్‌లో స్నానం చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అలాగే, బాత్‌రూంలో తీసుకున్న మరో పిక్‌ను కూడా వదిలింది. దీంతో ఈ అమ్మడు మరోసారి సెన్సేషన్ అయిపోతోంది.

భారీ స్పందన.. ట్రోల్స్: సమంత రూత్ ప్రభు తాజాగా షేర్ చేసిన బాత్‌రూం పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొందరు అభిమానులు ఆమె అందాలను విపరీతంగా పొగడుతూ సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సమంతను బాగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫొటోలు అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











