Heroines Remuneration: టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. టాప్ ప్లేస్‌లో ఉన్నది ఎవరో తెలుసా?

తెలుగు సినీ రంగంలో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నరు. హీరోలు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఒకటే హీరోయిన్ చాలా మంది సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటుంది. అందం, అభినయంతో పాటు అంతకు మించిన అదృష్టం ఉంటేనే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంటారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ రోజుల్లో ఎక్కువ కాలం టాప్ హీరోయిన్ గా కొనసాగాలన్నా, పోటీని తట్టుకోవాలన్నా చాలా లక్ ఉండాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆరుగురు నుంచి పది మంది టాప్ హీరోయిన్లు కూడా లేరు.

కానీ ఉన్న వాళ్లు మాత్రం గట్టిగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా సినిమాకు రోజూ దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనుకుంటున్న ముద్దుగుమ్మలు అధిక మొత్తం పారితోషికం అందుకుంటూ బాగా సంపాధిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. అయితే టాప్ స్థానంలో ఉండి, టాప్ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న ఆ హీరోయిన్లు ఎవరు, ఎంత తీసుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Top Heroines Remuneration Check Details

జవాన్ సినిమా సక్సెస్ అయిన తర్వాత నుంటి నయనతార తన రెమ్యురేషన్ ను పెంచేసింది. ప్రస్తుతం 5 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది. అలాగే అనుష్క శెట్టి కూడా 3 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కూడా బాగానే డబ్బులు అందుకుంటోంది. ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకూ అందుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది.

Tollywood Top Heroines Remuneration Check Details

అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. గీతా గోవిందం సినిమా అప్పటి నుంచి ఈమె టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇక పుష్ప సినిమాతో విపరీతమైన గుర్తింపును తెచ్చుకొని రెమ్యునరేషన్ ను కూడా పెంచేసుకుంది. ముఖ్యం 2.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బాలీవుడ్ లో యానిమల్ సినిమా కనుక హిట్ అయిందంటే.. ఆమె పారితోషకం మరింత పెరిగే అవకాశం ఉంది.

Tollywood Top Heroines Remuneration Check Details

ఇక ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలల.. టాప్ హీరోయిన్ గా ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 1.50 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా భగవంత్ కేసరి సినిమా హిట్టు అవడంతో తన రెమ్యునరేషన్ ను డబుల్ చేసేసినట్లు తెలుస్తోంది. అంటే రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందట. ఇక నిధి అగర్వాల్ కూడా ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకూ ఛార్జ్ చేస్తోందట. హరిహర వీరమల్లు తర్వాత ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కీర్తి సురేష్ 2 కోట్లు, అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2 కోట్లు, తమన్నా భాటిగా కోటి వరకూ, కియారా అద్వానీ 3 కోట్ల వరకూ తీసుకుంటుందని అంటున్నారు. అలాగే రాశీ ఖన్నా 60 లక్షలు తీసుకుంటుందని, రకుల్ ప్రీత్ సింగ్ 70 లక్షలు, న్యాచురల్ క్యూట్ బ్యూటీ సాయి పల్లవి 1.25 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X