Sobhita Dhulipala: తెగించిన తెలుగు అందం.. చీరతోనే చిత్రవధ చేస్తున్న శోభితా!
శోభితా ధూళిపాళ్ల.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈమె పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా హిందీ చిత్రసీమ ద్వారానే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడూ చాలా హాట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత 2018లో గూఢచారి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంది. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.
కేవలం హిందీ, తెలుగు చిత్రాల్లోనే కాకుండా శోభితా.. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. పర్సనల్ విషయాలతో పాటు కెరియర్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని చాలా హాట్ గా కనిపిస్తోందీ క్యూట్ బ్యూటీ.

క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ లో ఉన్న శారీలో శోభిత చాలా అందంగా కనిపిస్తోంది. సొగసైన చీరకు మ్యాచింగ్ గా మెడలో ఓ చోకర్ వేసుకొని ఓ పెద్ద ఫింగర్ రింగ్ స్టైల్ చేసింది. అలాగే చెవులకు దుద్దులు కూడా పెద్దవే పెట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. మత్తెక్కించే కళ్లతో కైపుగా చూస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ ఫొటోల్లో శోభితా అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో శోభితా అందాలు చూస్తే ఆహా అనకుండా ఉండడం చాలా కష్టం.

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. అచ్చమైన తెలుగు అమ్మాయివి అయిన నువ్వు చాలా హాట్ గా ఉన్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా శోభితా దూళిపాళ్ల అందాలకు ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే.

శోభితా దూళిపాళ్ల, అక్కినేని నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపించింది. కానీ ఈ వార్తలపై స్పందించిన శోభితా.. అదంతా అవాస్తవం అని చెప్పింది. కానీ తరచుగా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఎక్కువగా కనిపించడంతో అంతా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వీరి గురించి ఎక్కువగా రూమర్లు వినిపించట్లేదు. చూడాల మరి ఏం జరగనుందో.



Click it and Unblock the Notifications











