Year End 2023: బాలీవుడ్‌లో టాప్ 10 హీరోయిన్లు వీరే.. అలియాభట్, దీపికా, కత్రినా ఏ స్థానంలో ఉన్నారంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారలపై, ఫేమస్ పర్సనాలిటీస్ పై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించి బాలీవుడ్‌లో టాప్ 10 హీరోయిన్స్ జాబితాను రిలీజ్ చేసింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారు అనే దానిపై సోషల్ మీడియా, ఆన్ లైన్ ఆధారంగా ఈ సర్వేను నిర్వహించి ఈ లిస్టును రిలీజ్ చేసింది. బాలీవుడ్‌లో హీరోయిన్ అలియా భట్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక నంబర్ 2 స్థానంలో ఎవరు ఉన్నారు.. టాప్ 10 హీరోయిన్లలో ఎవరెవరు ఉన్నారనే అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే... ఎవరి హీరోయిన్ అభిమానులు.. మా హీరోయిన్ గొప్ప అంటే.. మా హీరోయిన్ గొప్ప అని చెప్పుకుంటారు. అయితే నిజానికి ఈవిషయంపై ఎవరు క్లారిటీగా చెప్పలేరు. ఎవరికి ఉండే ప్రముఖ్యత వారికి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్లో టాప్ 10 హీరోయిన్స్ ఎవరో సర్వే నిర్వహించింది. టాప్ 10 హీరోయిన్ వీళ్లే అంటూ ఓ జాబితాను సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది.

Top 10 heroines in Bollywood: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif, kiara Advani etc Full Details Here

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 10 హీరోయిన్స్ లో నంబర్ వన్ స్థానాన్ని అలియా భట్ కైవసం చేసుకుంది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి సైతం పరిచయం అయింది ఈ బ్యూటీ. ఇక ఈ భామ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. ఇక రెండో స్థానంలో దీపిక పదుకుణె నిలిచింది. ఇక ఈ భామ ఫైటర్ అనే సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Top 10 heroines in Bollywood: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif, kiara Advani etc Full Details Here

టాప్ 3లో కత్రీనా కైఫ్ నిలిచింది. ఇటీవల టైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. హిందీలో టాప్ 3 హీరయిన్ గా కొనసాగుతోంది. ఇక టాప్ 4లో కియార అడ్వానీ నిలిచింది. ఈ భామ రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తుంది. ఇక ఈ భామ పేరు ఇప్పటికే గుగూల్ సెర్చ్ లో నంబర్ 1గా నిలిచింది. ఇక టాప్ 5లో కృతి ససన్ నిలిచింది. ఈ భామ ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షుకలకు కూడా దగ్గరైంది.

Top 10 heroines in Bollywood: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif, kiara Advani etc Full Details Here

ఇక టాప్ 6లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నిలిచింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాప్ 7లో కరీనా కపూర్ నిలిచింది. నాలుగు పదుల వయసులోనూ ఈ భామ అందాల ఆరబోత తగ్గడం లేదు. అంతే జోష్ తో సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇక టాప్ 8లో ప్రియాంక చోప్రా నిలిచింది. ఈ భామ నిక్ జోనస్ ను వివాహం చేసుకుని.. ఫుల్ బిజియెస్ట్ ఉమెన్ అయిపోయింది.

టాప్ 9 ఐశ్వర్య రాయ్ బచ్చన్ నిలువగా.. ఈ భామ ఇటీవల పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ భామతన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు సపరేట్ కానున్నట్లు బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. అయితే ఈ విషయంపై క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి ఐశ్వర్య రాయ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక టాప్ 10లో అనుష్క శర్మ నిలిచింది. అవండి హిందీలో టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X