Top 10 Heroines: ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే... 2వ స్థానంలో సమంత, నంబర్ 1 ఎవరో తెలుసా?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారు అనే దానిపై సోషల్ మీడియా, ఆన్ లైన్ ఆధారంగా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇండియా వైడ్ గా మన టాలీవుడ్ హీరోయిన్ సమంత నంబర్ 3 స్థానంలో ఉంది. ఇక నంబర్ వన్ స్థానంలో ఎవరు ఉన్నారు.. టాప్ 10 హీరోయిన్లలో మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరు అంటే... ఎవరి హీరోయిన్ అభిమానులు.. మా హీరోయిన్ గొప్ప అంటే.. మా హీరోయిన్ గొప్ప అంటారు. అయితే నిజానికి ఎవరు కరెక్టుగా చెప్పలేరు. ఎవరికి ఉండే ప్రముఖ్యత వారికి ఉంటుంది. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ ఎవరో సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోయిన్ వీళ్లే అంటూ ఓ జాబితాను సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేసింది.

Top 10 Heroines In India: Ormax media company Release the list

పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 10 హీరోయిన్స్ లో నంబర్ వన్ గా అలియా భట్ నిలిచింది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి సైతం పరిచయం అయింది. ఇక ఈ భామ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. ఇక రెండో స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నిలిచింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా ఈ భామ టాప్ 2లో నిలవడం విశేషం. మయోటైటిస్ లో బాధపడుతూ ప్రస్తుతం ఈ భామ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Top 10 Heroines In India: Ormax media company Release the list

టాప్ 3లో దీపికా పదుకునె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో గెస్టు రోల్ లో నటించిన ఈ భామ.. పాన్ ఇండియా లెవెల్ టాప్ 3 హీరయిన్ గా కొనసాగుతోంది. ఇక టాప్ 4లో లేడీ సూపర్ స్టార్ నయనతార నిలిచింది. ఈ భామ జవాన్ సినిమాతో ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ కొట్టింది. ఇక టాప్ 5లో త్రిష కృష్ణన్ నిలిచింది. ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2, లియో, ది రోడ్ వంటి చిత్రాలు చేసిన త్రిష.. ఆమె చేతిలో స్టార్ హీరోల చిత్రాలు ఉన్నాయి. ఇగ టాప్ 5 స్థానం కొట్టేసింది ఈ అందాల భామ. ఇక టాప్ 6లో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమాలో కత్రినా టవల్ సీన్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక టైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

టాప్ 7లో కాజల్ అగర్వాల్ నిలిచింది. ఈ భామ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక టాప్ 8లో కియార అద్వాని నిలిచింది. రామ్ చరణ్ తో ఈ భామ గేమ్ చేంజర్ సినిమా చేస్తుంది. టాప్ 9 తమన్నా నిలువగా.. ఈ భామ ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక టాప్ 10లో నేషనల్ క్రష్ రష్మిక నిలిచింది. ఈ భామ యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అవండి ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X