Top 10 Heroines : ఇండస్ట్రీని ఏలేస్తున్న టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. సమంత, రష్మిక ఏ స్థానంలో ఉన్నారంటే?
Top 10 Heroines in India: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా సంస్థ ( Ormax Media) నవంబర్ 2025కు గాను విడుదల చేసిన ఓర్మాక్స్ సార్ట్స్ ఇండియా లవ్స్- మోస్ట్ పాపులర్ ఫీమెల్ ఫిల్మీ స్టార్స్ ఇన్ ఇండియా' జాబితా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌లో మరోసారి సమంత రుత్ ప్రభు( Samantha Ruth Prabhu) తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అదే సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తన స్థానం పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్, బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో వరుసగా కనిపిస్తూ కంటెంట్ ఆధారిత పాత్రలతో దూసుకుపోతున్న సమంత మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ముందడుగు వేస్తూ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు మార్కెట్ విలువలోనూ టాప్‌లో కొనసాగుతోంది.తాజాగా డైరెక్టర్ రాజ్ నిడిమోర్ ని రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ మారింది. వరుసగా రెండోసారి అగ్రస్థానం దక్కించుకోవడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం ఇదే.

రెండో స్థానంలో ఆలియాభట్ (Alia Bhatt) నిలిచింది. గత కొంతకాలంగా టాప్‌లో ఉన్న ఆలియా, ఈ రెండు నెలలుగా సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంటోంది. బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, బిజినెస్ రంగాల్లోనూ ఆమె హవా కొనసాగుతోంది. నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన రష్మిక (Rashmika Mandanna) ఈసారి మూడో స్థానానికే పరిమితమైంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, ఈ నెల టాప్ 2లో చోటు దక్కకపోవడం అభిమానులకు కాస్త షాక్ ఇచ్చింది. అయితే 2026లో రిలీజ్ కానున్న భారీ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ టాప్ రేస్‌లోకి రావాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక నాలుగో స్థానంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నిలిచింది. గత నెల మూడో స్థానంలో ఉన్న కాజల్ ఈసారి ఒక స్థానం దిగజారినా, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక హీరోయిన్ త్రిష ఐదో స్థానంలో కొనసాగుతోంది. 40 ఏళ్లు దాటినా, వరుస సినిమాలు, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్‌తో త్రిష ఇప్పటికీ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఎవరూ ఊహించని విధంగా ఆరవ స్థానంలో దీపిక పడుకోనే (Deepika Padukone) ఉంది. ఇటీవల కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నా, ఆమె మార్కెట్ మాత్రం నిలకడగా ఉంది.
ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఏడో స్థానంలో నిలిచింది. 40 ఏళ్లు దాటినా, నయన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ తగ్గలేదని ఈ ర్యాంకింగ్ మరోసారి నిరూపించింది. ఇక సౌత్ ఇండస్ట్రీ ఫేమ్ సాయి పల్లవి (Sai Pallavi) ఎనిమిదో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో ఏడో స్థానంలో ఉన్న ఆమె ఈసారి ఒక స్థానం దిగజారింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'రామాయణం'లో సీత పాత్రతో భారీ అంచనాల మధ్య ఉంది.
తొమ్మిదో స్థానంలో టాలీవుడ్ బ్యూటీ, కన్నడ అమ్మడు శ్రీలీల (Sreeleela) ఉంది. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ చూసిన ఆమె, తాజాగా వరుస పరాజయాలతో ర్యాంకింగ్‌లో కాస్త వెనక్కి వెళ్లింది. ఇక చివరిగా పదో స్థానంలో అనుష్క శెట్టి (Anushka Shetty) నిలిచింది. ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదని ఈ లిస్ట్ స్పష్టం చేసింది. గతంలో ఈ స్థానంలో తమన్నా ఉండగా, ఇప్పుడు అనుష్క ఆ ప్లేస్‌ను దక్కించుకుంది.
ఓర్మాక్స్ విడుదల చేసిన ఈ టాప్ 10 హీరోయిన్ల జాబితా చూస్తే.. కేవలం సినిమాల సంఖ్య మాత్రమే కాదు కంటెంట్ ఆధారిత పాత్రలు, పాన్ ఇండియా ఇమేజ్, బ్రాండ్ విలువ, పాపులారిటీ వంటి విషయాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తున్నాయని స్పష్టమవుతోంది. వచ్చే నెలల్లో కొత్త సినిమాల విడుదలతో ఈ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











