Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ లేపుతున్న హీర్లోయిన్లు.. ఎవరెవరికి ఎన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా?
స్టార్ హీరోయిన్లు అనిపించుకోవడానికి సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తే సరిపోదు. సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ, ఫాలోవర్స్ సంఖ్యను భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సౌత్ హీరోయిన్లు ఎవరు? అందులోనూ నెంబర్ వన్ ఎవరు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
1. రష్మిక మందన్న
నేషనల్ క్రష్ అనే బిరుదుతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ప్రస్తుతం 43.3 మిలియన్ల మంది ఉన్నారు. రానున్న పాన్ ఇండియా సినిమాలతో బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

2. సమంత
గత ఏడాది కాలంగా సినిమాలు చేయకపోయినప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 హీరోయిన్లలో ఈ బ్యూటీ రెండో స్థానంలో ఉంది. సమంతను 35.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

3. కాజల్
పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా కాజల్ అగర్వాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం డౌన్ అవ్వలేదు. అవకాశాలు రావట్లేదు గానీ ఈ బ్యూటీ క్రేజ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని విధంగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో చందమామను 27.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

4. పూజా హెగ్డే
అవకాశాలు పూర్తిగా కరువైనప్పటికీ పూజ హెగ్డే కు సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీని ఇన్ స్టాగ్రామ్ లో 27.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

5. శృతిహాసన్
ఇటీవల కాలంలో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ ప్రస్తుతం నాలుగైదు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో ఆకట్టుకొన్న ఈ అమ్మడికి ఇన్ స్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

6. తమన్నా
రీసెంట్ గా బాక్ సినిమాతో 2024లో తమిళంలో మొట్టమొదటి 100 కోట్ల మూవీని అందుకున్న హీరోయిన్ గా రికార్డును క్రియేట్ చేసిన తమన్నాను 25.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

7. రకుల్ ప్రీత్ సింగ్
పెళ్లయ్యాక సినిమాల జోరు తగ్గించిన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ 2లో నటిస్తుండగా, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 23.7 మిలియన్లు ఉంది.
8. తాప్సి
సౌత్ ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసిన తాప్సికి ఇన్ స్టాగ్రామ్ లో 20.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

9. కీర్తి సురేష్
ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ బాగా వెనకబడిపోయింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగు పెడుతున్న కీర్తికి రానున్న కాలంలో అభిమానుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 17.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
టిల్లు స్క్వేర్ మూవీతో రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అనుపమ ఈ లిస్ట్ లో చివర్లో ఉంది. ప్రస్తుతం అనుపమ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 16.3 మిలియన్లు ఉంది.


Click it and Unblock the Notifications











