Sye Raa Trailer: తమన్నా పాత్రను చూసి బాధపడుతున్న టాప్ హీరోయిన్లు!

ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా కొన్నిసెకన్లపాటు తళుక్కున మెరిసి ఆకట్టుకున్నారు.

తమన్నా పాత్రను చూసి..

తమన్నా పాత్రను చూసి..

సైరా ట్రైలర్‌లో కనిపించేది కాసేపే అయినప్పటికీ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమె డైలాగ్స్ కూడా చిత్రంలో ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో తమన్నా పోషించిన పాత్రను వదులుకున్న కొందరు టాప్ హీరోయిన్లు కొంత బాధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాప్ హీరోయిన్లను సంప్రదించినా..

టాప్ హీరోయిన్లను సంప్రదించినా..

ఆలయంలో నర్తించే లక్ష్మీ అనే పాత్రను తమన్నా సైరాలో పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం తమన్నా కొంటే ముందే ఈ చిత్ర యూనిట్ చాలా మంది ప్రముఖ హీరోయిన్లను సంప్రదించిందట. అయితే, ఈ పాత్ర చేసేందుకు వారు అంగీకరించలేదట. నయనతార కంటే తక్కువ స్థాయి పాత్ర కావడంతో ఆ హీరోయిన్లు ఈ పాత్ర చేసేందుకు వెనుకడుగు వేశారు. నయనతార సైరా నరసింహా రెడ్డి భార్య సిద్దమ్మగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ట్రైలర్‌లో తమన్నా పాత్ర చిత్రీకరణను చూసిన తర్వాత ఆ పాత్రను ఒప్పుకుంటే బాగుండేదేమోనని వారంతా భావించినట్లు తెలిసింది.

నయనతార లోటును తమన్నానే..

నయనతార లోటును తమన్నానే..

ఇక నయనతార తన ఇతర సినిమా షెడ్యూల్స్ కారణంగా సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోతోంది. దీంతో ఆ లోటును తమన్నానే తీర్చేస్తోంది. దీంతో ఆమె మరోసారి లైమ్ లైట్‌లోకి వస్తోంది. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తమన్నా తళుక్కున మెరిసే అవకాశం ఉంది.

బాహుబలి తర్వాత మరోసారి..

బాహుబలి తర్వాత మరోసారి..

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా చిత్రంలో తమన్నాది కీలక పాత్ర అని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతోంది. బాహుబలి తర్వాత తమన్నా మరోసారి ప్రేక్షకులను ఈ పాత్ర ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారీ తారగణంతో రూపుదిద్దుకున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనుష్క శెట్టి కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X