41 ఏళ్ల వయసులో తరగని అందాలతో ప్రియాంక చోప్రా!

ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది మాత్రమే విపరీతంగా ప్రభావాన్ని చూపించారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు స్టార్ స్టేటస్‌ను చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. చాలా ఏళ్ల పాటు పాన్ ఇండియా హీరోయిన్‌గా హవాను చూపిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయింది.

ఇప్పుడు సినిమాల వేగం తగ్గినా తనదైన రీతిలో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ పిక్ వదిలింది. అది మీరే చూసేయండి మరి!

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

ప్రపంచ సుందరిగా గెలిచి: చిన్న వయసులోనే ప్రియాంక చోప్రా మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చింది. అందులో అందం, అభినయంతో రాణించి తక్కువ టైంలోనే స్టార్‌గా మారింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించుకోగలిగింది.

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

హాలీవుడ్‌లోకి వెళ్లి లవ్‌లో: చాలా ఏళ్ల పాటు బాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌‌గా మారింది. అదే సమయంలో ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

తల్లైన తర్వాత స్పీడుగా: చాలా కాలం పాటు వయసులో చిన్నోడైన నిక్ జోనస్‌తో డేటింగ్ చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. దీంతో ఫారెన్‌లోనే స్థిరపడిపోయి అక్కడి కల్చర్‌‌కు కూడా అలవాటు పడింది. ఇక, ఈ అమ్మడు సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు తల్లైంది. ఈ విషయం ప్రకటించి సంచలనం అయిపోయింది. అయినా కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూ వెళ్తోంది.

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

సీటాడెల్‌తో సత్తా చాటేసి: పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితాన్ని యమా ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా. ఈ క్రమంలోనే గత ఏడాది Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీనికి భారీ రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. దీనితో పాటు 'లవ్ అగైన్' మూవీతో వచ్చింది. ఇప్పుడు పీసీ 'హెడ్స్ ఆఫ్ స్టేట్' సినిమా చేస్తోంది.

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

సోషల్ మీడియాలో బిజీ: దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది.

గ్లామర్‌తో మాయ చేసేసి: చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటితో కుర్రకారును రెచ్చగొడుతూ రచ్చ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు తరచూ సెన్సేషన్ అవుతోంది.

Top Heroine Priyanka Chopra Latest Selfie Viral In Internet

ప్రియాంక పిక్ సెన్సేషన్: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ప్రియాంక చోప్రా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌రూంలో చిన్న షార్ట్, టాప్ ధరించి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు ఎదురుగా ఉన్న అందం నుంచి యమా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఘాటు ఫొటో బాగా వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X