మరోసారి బికినీలో సమంత సెన్సేషన్.. ఎన్ని రోజులైందో ఇలా చూసి!
సాధారణంగా సినిమాల్లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన మార్కును చూపించి చాలా కాలం పాటు పరిశ్రమను ఏలేస్తుంటారు. అలాంటి వారిలో సమంత రూత్ ప్రభు ఒకరు.
అదిరిపోయే అందంతో పాటు అద్భుతమైన నటనను కనబరిచే ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే వస్తోంది. ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాల వేగం తగ్గించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను మెప్పిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

అప్పుడు హిట్లు.. ఇప్పుడేమో: సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో డిఫరెంట్ మూవీల్లో నటించిన సమంత.. కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువగా చేస్తోంది. ఇలా 2022లో 'యశోద'గా వచ్చి హిట్‌ను అందుకుంది. అయితే, గత ఏడాది ఆమె నటించిన 'శాకుంతలం', 'ఖుషి' మూవీలు చేసింది. ఇవి మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసి ఆమెకు భారీ షాక్‌లు ఇచ్చాయి.

సమంత చేతిలో అదొకటేగా: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. ఈ మధ్యన మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించేసింది. ఇప్పుడైతే ఆమె ఒక్క మూవీని కూడా చేయట్లేదు. కానీ, 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

హెల్త్ పైనే ఎక్కువ ఫోకస్: సమంత రూత్ ప్రభు చాలా కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి కోసం ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత అరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అందులో యమ యాక్టివ్‌గా: చాలా ఏళ్ల పాటు తీరిక లేకుండా సినిమాలు చేసినా.. ఈ మధ్యన మాత్రం ఖాళీగానే ఉంటోన్నా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మాత్రం సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఈ స్టార్ హీరోయిన్ తన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హైలైట్ అవుతోంది.

అందాల విందుతో రచ్చ: సినిమాల్లోకి ఎంటరైన కొత్త గ్లామర్ రోల్స్ చేసిన సమంత రూత్ ప్రభు.. ఆ తర్వాత పంథాను మార్చుకుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఇటీవలి కాలంలో అయితే డోసు పెంచేసి మరీ రచ్చ రచ్చ చేస్తోంది.

మళ్లీ బికినీలో గ్లామర్ ట్రీట్: కొంత కాలంగా సమంత రూత్ ప్రభు తనదైన గ్లామర్ షోతో సోషల్ మీడియాను ఊపి పడేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చాలా గ్యాప్ తర్వాత టూ పీస్ బికినీ వేసుకుని విపరీతంగా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో సమంత రూత్ ప్రభు మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిపోయింది.

సమంత పిక్స్ ఫుల్ వైరల్: సమంత రూత్ ప్రభు తాజాగా షేర్ చేసిన ఘాటు ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు, అభిమానులు ఆమె అందాలను విపరీతంగా పొగడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సమంతను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫొటోలు అన్నీ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











