Heroines Remuneration: టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే.! ప్రియాంక, దీపిక, రష్మిక పారితోషికం ఎంతంటే?
Heroines Remuneration: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం అంటే అదృష్టమే. ఎందుకంటే పేరు, గౌరవం మాత్రమే కాదు భారీ స్థాయి పారితోషికం కూడా లభిస్తుంది. గతంలో స్టార్ హీరోయిన్లు పాత్రల్లో జీవించినా అంతగా రెమ్యునరేషన్ దక్కేది కాదు. అయితే నేటి తరం హీరోయిన్లు కేవలం రెండు-మూడు సినిమాలతోనే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఒక్క హిట్‌తోనే తమ మార్కెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ పుట్స్ ప్రకారం, భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల లిస్టులో నార్త్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, దీపిక పదుకొణె, అలియా భట్ వంటి టాప్ హీరోయిన్లు ముందువరుసలో ఉన్నారు. ఇంతకీ ఏ హీరోయిన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ?
ప్రియాంక చోప్రా : బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లో స్థిరపడి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణిగా కొనసాగుతోంది. తాజాగా రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కతున్న పాన్ వర్డల్ మూవీ వారణాసి (Varanasi) మూవీలో నటిస్తోంది. ఈ మూవీ నటిస్తున్నందుకు గాను రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

కంగనా రనౌత్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల్లో కంగనా రనౌత్ ఒకరు. బైపోలిక్స్, పవర్ పుల్ సొలో రోల్స్‌తో రాణిస్తున్న కంగనా రనౌత్ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఈ బ్యూటీ జయలత బయోపిక్ మూవీ తలైవా (Thalaivi) సినిమాకు రూ.25 కోట్లు తీసుకొని రెండో స్థానంలో నిలిచింది. లేడీ ఓరియేంట్ మూవీస్ లో దుమ్మురేపే కంగనా, తన మార్కెట్‌ను ఎన్నడూ తగ్గనివ్వలేదు.
దీపికా పదుకొణే: బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె, పాన్-ఇండియా మూవీ కల్కి (Kalki) నటించినందుకు గానూ రూ.20 కోట్ల భారీ పారితోషికం తీసుకుందట. వరుసగా భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న దీపికా, ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్లలో నిలిచింది.
అలియా భట్ : అలియా భట్ సోలోగా నటించిన 'గంగూబాయి కతియావాడీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వసూళ్లు, అలియా నటనకు వచ్చిన ప్రశంసలు ఆమె మార్కెట్‌ను మరింతగా పెంచాయి. ఈ సినిమాకు అలియా రూ.20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
కత్రినా కైఫ్ : బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ కూడా భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుంది. పాత్రకు ప్రాధ్యానత ఉంటే తక్కువ రెమ్యునరేషన్‌కే కూడా ఓకే చెప్పే ఆమె, సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.25 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అలా 'టైగర్ 3' సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుందట.
కియారా అద్వానీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన 'వార్ 2 '(War 2 Movie) కోసం కియారా అద్వానీ రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇలా సౌత్, బాలీవుడ్ రెండింట్లోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కియారా, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
సాయి పల్లవి: నేచురల్ స్టార్ సాయి పల్లవి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, ఆమె పారితోషికం కూడా భారీ స్థాయికి చేరింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ 'రామాయణ్'(Ramayana) మూవీలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికయ్యారు. ఈ ఛాలెంజింగ్ రోల్ కోసం ఆమె ఏకంగా రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.
నయనతార: లేడీ సూపర్‌స్టార్ నయనతార.. షారుక్ ఖాన్ సరసన నటించిన జవాన్ (Jawan) హిట్‌తో బాలీవుడ్‌లో క్రేజ్ పెంచుకుంది. ఈ విజయంతో ఆమె మార్కెట్ కూడా భారీగా పెరిగింది. జవాన్‌కు రూ. 12 కోట్లు తీసుకున్న నయన్, ఇప్పుడు కొత్త సినిమాలకు పారితోషికం 10 నుంచి 15 కోట్లు వరకు పెంచినట్లు ఇండస్ట్రీ టాక్.
కరీనా కపూర్: బాలీవుడ్ భామ కరీనా కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్. 'క్రూ' హిట్ తర్వాత ఆమె మార్కెట్ మరింత పెరిగింది. 'క్రూ' సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకోగా.. తరుపరి ప్రాజెక్ట్స్ కోసం రూ.10 నుండి రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.
సమంత రూత్ ప్రభు : టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆమె, తాజాగా సిటాడెల్ సిరీస్ కోసం సమంత భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. 'ఖుషీ' కోసం ₹4.5 కోట్లు తీసుకున్న ఆమె, 'సిటాడెల్' కోసం దాదాపు రూ.8 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











