Kiara Advani Remuneration: టాక్సిక్‌కి కియారా అద్వానీకి రెమ్యునరేషన్.. యష్ మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. శాండల్‌వుడ్‌తో పాటు 2026లో భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఉగాది, గుడి పర్వా, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న వరల్డ్ వైడ్‌గా టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటించిన చిత్రం కావడంతో టాక్సిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై హైప్ మరింత పెంచాయి. ఈ సినిమా కోసం నటీనటుల రెమ్యునరేషన్లు చిత్ర సీమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పారితోషికం ఎంతో పరిశీలిస్తే..
భారీ బడ్జెట్‌తో టాక్సిక్
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

టాక్సిక్‌పై భారీ అంచనాలు
యష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్‌తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లతో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన టాక్సిక్ టీజర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఇంటిమేట్ సీన్స్, వయలెన్స్.. ప్రేక్షకులకు విందు భోజనాన్ని అందిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. సరిగ్గా అదే రోజు రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ ధురంధర్ 2 కూడా రిలీజ్ కానుండటంతో రెండు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం పైచేయి సాధిస్తుంది? ప్రజల ఆదరణను ఏది దక్కించుకుంటుంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
కియారాకు వరుస ఫ్లాపులు
ఇదిలాఉండగా.. టాక్సిక్‌లో యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. గతేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్, వార్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత కియారాకు ఆఫర్లు కూడా తగ్గాయి. రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన దశలో టాక్సిక్‌పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు.
కియారాకు రికార్డ్ రెమ్యునరేషన్
అయితే, కియారా అద్వానీ ఈ టాక్సిక్ చిత్రానికి గాను భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. యష్ మూవీ కోసం ఏకంగా 15 కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ఆమె కెరియర్‌లోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్ అని చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ కోసం 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న కియారా.. వార్ 2 కోసం 13 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ కోసం ఆమె భారీగా ఛార్జ్ చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











