బీచ్ లో బికినీతో షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. అందాల విందుతో చంపేస్తోందే!

బెంగాలీ సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇచ్చిన త్రిధా చౌదరి ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు మూడు సినిమాల్లో నటించిన ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా అమెరికాలోని మియామి బీచ్ లో బికినీతో రచ్చ చేస్తున్న ఈ భామ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

బెంగాలీ భామ

బెంగాలీ భామ

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో పుట్టిన త్రిధా చౌదరి బెంగాలీ సినిమా మిషావర్ రాహోశ్యో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు బెంగాలీ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. ఈ భామకు హీరో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య లో హీరోయిన్ గా మాత్రం అవకాశం దక్కింది.

అలా తెలుగు ఎంట్రీ

అలా తెలుగు ఎంట్రీ

అలా ఆ సినిమాలో సంజన అనే పాత్రలో ఈ భామ అదరగొట్టేసింది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా దక్కలేదు అని చెప్పాలి. దీంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ తన సొంత ఇండస్ట్రీ బెంగాలీలో మళ్ళీ రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఏడాది మనసుకు నచ్చింది అనే సినిమాలో ఈ భామ నికిత అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

తెలుగులో రెండు సినిమాలు చేసినా అప్పటికి తెలుగులో గుర్తింపు అయితే దక్కలేదు. అవకాశాలు మాత్రం అంతంత గానే దక్కాయి. ఇక ఆ తర్వాత ఆమె తెలుగులో 7 అనే సినిమాలో హవీష్ సరసన నటించింది. ఏడుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే సినిమాలో నలుగురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించింది.

ఆశ్రమ్ తో క్రేజ్

ఆశ్రమ్ తో క్రేజ్

ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చినా సరే అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఆమె హిందీలో చేస్తున్న ఆశ్రమ్ అనే ఒక వెబ్ సిరీస్ లో బబిత అనే పాత్రకు మాత్రం ఈమెకు హాట్ బాంబ్ అనే ముద్రపడిపోయింది. అందులో ఒక వేశ్య పాత్ర పోషించడమే కాక అనేక హాట్ సీన్స్ లో నటించడంతో ఈమెకు హాట్ బాంబ్ గా పేరు వచ్చేసింది.

Recommended Video

Anukunnadi Okati Ayinadi Okati : Dhanya Balakrishna, Siddhi Idnani Request To Audience
బికినీతో ఫోజులు

బికినీతో ఫోజులు

ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూ ఉండే ఈ భామ మియామీ బీచ్ లో బికినీతో ఫోజులిచ్చింది. పూర్తిగా కనిపించకుండా టీజ్ చేస్తూ ఒక పక్క నుంచి చూపిస్తూ ఓరకంట ఫోజులిచ్చింది. ఇక ఆ తర్వాత ఒక రెస్టారెంట్లో కూర్చుని తింటున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసిన ఈ భామ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X