Bad News బోల్డ్ సీన్లలో తృప్తి దిమ్రి శృంగార లీలలు.. ఆ హీరోతో రెచ్చి పోయి ఆనిమల్ హీరోయిన్
ఒక్క సినిమా చాలా ఓవర్ నైట్ లో ఏ నటిని అయినా నటుడ్ని అయినా స్టార్ చెయ్యడానికి. అలాంటి సినిమా పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి అలా కొందరు హీరో హీరోయిన్స్ కి తమ కెరీర్ లోనే పెద్ద బ్రేక్ లు ఈ కొన్ని సినిమాలతో వస్తూ ఉంటాయి. అలానే గత ఏడాది ఓ హీరోయిన్ కి ఒక ఊహించని బ్రేక్ వచ్చింది. మరి ఆ హీరోయిన్ నే త్రిప్తి దిమ్రి.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈమె కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. తన అందం, గ్లామర్ షో తో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యిపోయిన త్రిప్తి దిమ్రి ఇప్పుడు ఆ సినిమా తర్వాత మరోసారి ఇండియా వైడ్ గా సెన్సేషన్ గా వినిపిస్తుంది.

కాగా ఈమె ప్రస్తుతం హిందీలో దర్శకుడు ఆనంద్ తివారీతో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమానే "బ్యాడ్ న్యూజ్". మరి ఇందులో బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ నటించాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన జానం అనే సాంగ్ కోసమే సోషల్ మీడియా అంతా రచ్చ నడుస్తుంది. త్రిప్తి దిమ్రి అలాగే విక్కీ కౌశల్ పై రిచ్ విజువల్స్ లో ప్లాన్ చేసిన ఈ సాంగ్ మొత్తం హాట్ నెస్ ఓవర్ లోడెడ్ గా ఉందని చెప్పాలి.
ఇద్దరు మెయిన్ లీడ్ ఎక్కడికో ట్రిప్ కి వెళ్లినట్టుగా కేవలం ఆ ఇద్దరి మీదనే డిజైన్ చేసిన సాంగ్ ఫుల్ రొమాంటిక్ గా కనిపిస్తుంది. బాత్రూం నుంచి బెడ్ రూమ్ ఆఖరికి డైనింగ్ టేబుల్, స్విమ్మింగ్ పూల్ లో కూడా వీరిద్దరూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇక విక్కీ సంగతి పక్కన పెడితే అసలు ఆనిమల్ సినిమా తర్వాత త్రిప్తి దిమ్రి అందరికీ మరో బిగ్ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

కంప్లీట్ గా బోల్డ్ షాట్స్, లిప్ లాక్స్ తో ఆమె రెచ్చిపోయింది. ఈ సాంగ్ లో ఒక్క శృంగారం తప్ప మిగతా అంతా చేసేసారు అనే రేంజ్ లో ప్లాన్ చేశారు. అలాగే విశాల్ మిశ్ర కంపోజ్ చేసిన ఈ సాంగ్ సింపుల్ అండ్ రొమాంటిక్ బీట్స్ తో కొనసాగితే వారిద్దరూ తమ కెమిస్ట్రీతో హీటెక్కించారు అని చెప్పాలి. అయితే ఈ సాంగ్ చూసాక మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక త్రిప్తి ఇలాంటి సినిమాలే చేసుకోవాలని కరణ్ జోహార్ కూడా ఈ తరహా సినిమాల నుంచి ఇక బయటకి రాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సాంగ్ లో ఫైనల్ ఎపిసోడ్ పై అయితే ఏకంగా నిరోద్ యాడ్ గాని చేసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా అయితే ఈ జూలై 19న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











