Remuneration: ప్రభాస్‌తో రొమాన్స్‌కు త్రిప్తి డిమ్రీ.. యానిమల్ బ్యూటీకి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రానున్న స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక ప్రాసెస్ జోరందుకొన్నది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. అయితే నిజాయితీ, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కథగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లో జరుగుతుందనే విషయం మీడియాలో హైలెట్‌గా మారింది.
అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందనే విషయం మరో హైలెట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరకు యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ పేరు ఖరారైంది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్పిరిట్ సినిమాలో కల్కి చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన దీపిక పదుకొన్ హీరోయిన్‌గా నటించనున్నారనే విషయం వైరల్ అయింది. అయితే ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే వార్త బాంబులా పేలింది. దీపిక గొంతెమ్మ కోరికలకు తట్టుకోలేక ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఆమె తన రెమ్యునరేషన్‌గా 30 కోట్లు చెల్లించాలి. అదనంగా జీఎస్టీని కూడా నిర్మాతే చెల్లించాలని కండీషన్ పెట్టింది. అలాగే తనకు సంబంధించిన 26 మంది సిబ్బంది టీమ్‌కు ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించాలి. అలాగే తాను ఈ సినిమా కోసం 8 గంటల కాకుండా 6 గంటలే పనిచేస్తాను అని మరో షరతు విధించడంతో ఆమెను ఈ మూవీ నుంచి తప్పించినట్టు బాలీవుడ్ క్రిటిక్స్ కేఆర్కే, ఉమేర్ సంధూ తమ ట్వీట్ల ద్వారా వెల్లడించారు.
అయితే ఈ సినిమా కోసం మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. శ్రద్దా కపూర్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ల పేర్లు ట్రెండ్ అయ్యాయి. అయితే చివరకు రష్మిక నుంచి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ లాగేసుకొన్న త్రిప్తి డిమ్రిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఫైనల్ చేశాడు. అంతేకాకుండా మీడియాలో వస్తున్న గాసిప్స్‌కు తెర దించుతూ సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. నా సినిమా కోసం ఫీమేల్ లీడ్ కన్ఫార్మ్ అయింది. ఆమె త్రిప్తి డిమ్రి అంటూ భారతీయ ప్రధాన భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా ఆమె పేరుతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో భేషరతుగా అంగీకరించినట్టు త్రిప్తి డిమ్రీ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రభాస్ పక్కన, సందీప్ రెడ్డి వంగా సినిమాలో మరోసారి నటిస్తున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను. ఈ ఆనందంలో ఇంకా మునిగితేలుతున్నాను. ఈ జర్నీలో నన్ను భాగం చేసి నమ్మినందుకు గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను. థ్యాంక్యూ సందీప్ రెడ్డి వంగ.. మీ విజన్‌లో భాగమైనందుకు నిజంగా నాకు గౌరవం దక్కింది అని ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను.. యానిమల్ కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్‌ను టీ సిరీస్ చెల్లించింది. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు సుమారుగా 5 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ పారితోషికం. ఈ సినిమాతో ఆమె కెరీర్ మరో మలుపు తిరుగుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











